By: ABP Desam | Updated at : 01 Aug 2023 03:41 PM (IST)
రోడ్ షోలో చంద్రబాబు
రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో డెవలప్ మెంట్ కోసం తాము రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామని, రాయలసీమ ద్రోహి అయిన జగన్ ఖర్చు చేసింది కేవలం రూ.2 వేల కోట్లే అని అన్నారు. జగన్ పదే పదే బటన్ నొక్కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానంటున్నారని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కడం కాకుండా.. బటన్ బుక్కుడు ఎక్కువైందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా నిత్యావసరాల ధరలు పెంచడంతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారని, ఇప్పటికి 8 సార్లు పెంచారని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు మంగళవారం (ఆగస్టు 1) పర్యటించారు. నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించి, అందులో మాట్లాడారు. ముచ్చుమర్రి, బనకచర్ల వంటి నీటి ప్రాజెక్టులను సందర్శించారు.
వైఎస్ఆర్ సీపీ పాలనలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సైకో తయారు అవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే తాటతీస్తానని, వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘సీఎం జగన్ గట్టిగా ఒక గంట పని చేయగలవా? సాయంత్రం 6 అయితే, కనిపిస్తావా? - పుట్టుకతో వృద్ధుడైన సైకో’ అంటూ చంద్రబాబు కౌంటర్లు వేశారు.
Age is Just a Number.. గట్టిగా ఒక గంట పని చేయగలవా ? సాయంత్రం 6 అయితే, కనిపిస్తావా ? - పుట్టుకతో వృద్ధుడైన సైకోకి, @ncbn గారి కౌంటర్ #CBNinNandikotkur#ProjectsKillWaterNill#YuddhaBheri#JaganFailsIrrigation#AndhraPradesh #NalugellaNarakam #JaganLosingIn2024… pic.twitter.com/AafObhNiyh
— Telugu Desam Party (@JaiTDP) August 1, 2023
టీడీపీ హయాంలో ఎన్నో నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని అన్నారు. హంద్రీనీవా, తెలుగు గంగ, ముచ్చుమర్రి, ఎస్‌ఆర్‌బీసీ లాంటి ప్రాజెక్టులు టీడీపీనే చేపట్టిందని గుర్తు చేశారు. రాయలసీమ కోసం జగన్ చిత్తశుద్ధితో పని చేశారా? అని నిలదీశారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా సీఎం జగన్ చేశారని అన్నారు.
సరిగ్గా రోడ్ల వేయలేరు కానీ, మూడు రాజధానులు కడతారట అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులు అనడం అర్థం లేని పనిగా కొట్టి పారేశారు. మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా సీఎం జగన్ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. పరదాల మాటున జగన్ పర్యటనలు ఉంటున్నాయని, ధైర్యం ఉంటే ప్రజల మధ్యలోకి రావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీని నామరూపం లేకుండా చేస్తేకానీ, ఏపీ మంచి న్యాయం జరగబోదని చంద్రబాబు అన్నారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో సందర్భంగా నందికొట్కూరులో రోడ్లు జనసంద్రమయ్యాయి. చంద్రబాబు గారి ప్రసంగాన్ని వినేందుకు ఉత్సాహంగా తరలి వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిసాయి#CBNinNandikotkur#ProjectsKillWaterNill#YuddhaBheri#JaganFailsIrrigation#AndhraPradesh… pic.twitter.com/d26TMv5LMf
— Telugu Desam Party (@JaiTDP) August 1, 2023
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా
AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు
జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>