News
News
X

Bribery of ACB: ఆలూరులో రెవెన్యూ అధికారుల లంచం వ్యవహారం కలకలం !

Bribery of ACB: కర్నూలు జిల్లా ఆలూరులో ఏసీబీ అధికారుల లంచం వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మామూళ్ల కోసం వైసీపీ నేతలను పీడించడంతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.

FOLLOW US: 

Bribery of ACB: కర్నూలు జిల్లా ఆలూరులో రెవిన్యూ అధికారులు 15 వేల రూపాయలను లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల నుండి మామూళ్లను వసూలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో అనిశా అధికారులు రేషన్ డీలర్ కోసం 15,000 లంచాన్ని డిమాండ్ చేశారు. అందులో రూ. 10,000 అధికారికి, రూ. 5,000 మరొక అధికారికి అంటూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కడుతోంది. 

డబ్బులిస్తే డీలర్ షిప్ నీదేనయ్యా..!

గతంలో ఉన్న డీలర్ ను తొలగించి కొత్త డీలర్ ను నియమించడం కోసం అవినీతి నిరోదక శాఖ అధికారులు ఓ వ్యక్తి దగ్గర 15 వేల రూపాయలను డిమాండ్ చేశారు. అలాగే ఆ డబ్బులు త్వరగా చెల్లిస్తే మీకే డీలప్ షిప్ వస్తుందంటూ అధికారి చెప్పడం గమనార్హం. డబ్బులు ఇస్తాం కానీ.. డీలర్ షిప్ నిజంగానే వస్తుందా లేదా అని వ్యక్తి అడగ్గా.. అలా ఏం లేదు. ఏం చేసినా జేసీ దగ్గరికి వెళ్లిన ఆ డీలర్ షిప్ మీకే వస్తుందంటూ హామీ ఇచ్చాడు ఆ అధికారి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ ఆడియో క్లిప లోని మాటలపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. అవినీతి అడ్డుకోవాల్సిన అధికారులే అవినీతి చేయడం, లంచం తీస్కోవడం ఏంటంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. 

అవినీతి జరగకుండా చూడాల్సిన వాళ్లే లంచం అడగడం ఏంటయ్యా..?

ఏ డిపార్టుమెంటుకు సంబంధించిన వాళ్లయినా సరే అవినీతి చేస్తే.. వారిని ప్రశ్నించి, విచారణ జరిపి, నిందితులను పట్టుకోవాల్సిన అధికారులే అవినీతి చేయడం చాలా దారుణం అని చెబుతున్నారు. ఇలాంటి అధికారులను వెంటనే పదవిలోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖలోనే ఇంత అన్యాయం జరగుతుంటే.. ఇంక బయట పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడుతూ.. అవినీతి పరులపై పంజా విసరాల్సిన అధికారులు లంచం అడగడం నిజంగా సిగ్గుపడాల్సి విషయం అని అంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అధికారులను పదవుల నుంచి తప్పించి.. పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.  

Also Read: Chikoti Case : చికోటి కేసినో కేసులో నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు - అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ?

Published at : 07 Aug 2022 11:09 AM (IST) Tags: Bribery of ACB Bribery of ACB Latest News ACB Officials Bribery ACB Officials Bribery At Kurnool ACB Officials Bribery Audio Viral

సంబంధిత కథనాలు

Orvakal Industrial Park : ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు నీటి వసతి, రూ.288 కోట్ల పైపు లైన్ పనులకు శ్రీకారం

Orvakal Industrial Park : ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు నీటి వసతి, రూ.288 కోట్ల పైపు లైన్ పనులకు శ్రీకారం

ట్రిపుల్‌ ఆర్‌లో ఎన్టీఆర్‌కు అది శిక్ష- కర్నూలులో వాళ్లకు సాహసం

ట్రిపుల్‌ ఆర్‌లో ఎన్టీఆర్‌కు అది శిక్ష- కర్నూలులో వాళ్లకు సాహసం

Stick Fight Festival: కర్రల సమరంలో విషాదం: ఒకరు మృతి, 50 మందికి పైగా గాయాలు

Stick Fight Festival: కర్రల సమరంలో విషాదం: ఒకరు మృతి, 50 మందికి పైగా గాయాలు

తెలుగుయువత లీడర్‌ వేధింపులతో బాలిక ఆత్మహత్య- సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు

తెలుగుయువత లీడర్‌ వేధింపులతో బాలిక ఆత్మహత్య- సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు