News
News
X

Kurnool News: ఆమె కళ్లు మరో వందేళ్లు ఈ ప్రపంచాన్ని చూస్తాయి- నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపిన చరిత

30 ఏళ్ల మహిళ ఆదర్శంగా నిలిచారు. తాను చనిపోతూ చరిత్రలో నిలిచిపోయారు. కన్నీరును పంటి బిగువున ఉంచుకొని ఆ ఫ్యామిలీ చేసిన పనిని అంతా ప్రశంసిస్తున్నారు.

FOLLOW US: 

కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌లో అర్థరాత్రి వైద్యుల హడావుడి... ఆస్పత్రిలోని సిబ్బంది అంతా ఉరుకులు పరుగులతో శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 మంది వైద్యుల బృందం ఆసుపత్రికి చేరుకుంది. భారీగా పోలీసుల మోహరింపు. కర్నూలు నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్‌లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్లకు ఏ అడ్డంకి లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులకు, ఆసుపత్రిలోని రోగుల బంధువులకు ఈ హఠాత్పరిణామాలు అర్థం కావడం లేదు. కనిపించిన వైద్య సిబ్బందిని ఏం జరుగుతుంది అంటూ అడిగే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అంతలోనే ఆపరేషన్ థియేటర్లో ధరించే దుస్తులతో మాస్క్‌తో ఓ వైద్యుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే అందరూ ఆయన చుట్టూ చేరి ఏం జరుగుతోందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మూతికున్న మాస్కు మెల్లగా తీసేస్తూ ఆ వైద్యుడు తన చుట్టూ చేరిన వారికి పరిస్థితిని వివరించడం మొదలుపెట్టారు. 

ఓ 30 ఏళ్ల యువతి తన అవయవాలను దానమిచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి ప్రాణదాతగా మారిందంటూ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళ కళ్ళు చెమర్చాయి. ఊపిరితిత్తులు, గుండె, కళ్ళు, కిడ్నీలు, లివర్ తదితర అన్ని అవయవాలను వాటి అవసరం ఉన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉన్న  రోగులకు అమర్చేందుకు సమాయత్తం అవుతున్నట్లు వైద్యుడు చెప్పారు. అవయవాల దాత చరితకు అందరూ ధన్యవాదాలు తెలిపి ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకున్నారు. 

తెలంగాణలోని గద్వాల్‌కు చెందిన 30 సంవత్సరాల చరిత గత నెలలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. కాన్పు అయిన 10 రోజుల తర్వాత ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయింది. అపస్మారకస్థితికి చేరుకుంది. స్థానికంగా వైద్య చికిత్సలు అందించిన అనంతరం కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మెదడు అచేతనంగా ఉందని బంధువులకి చెప్పడంతో ఆమె బంధువులు వైద్యనిపుణుల సలహా మేరకు జీవనదారా స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి అవయవాలు దానం చేయడానికి అంగీకారం తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన వైద్య బృందం శస్త్ర చికిత్సలకు సమాయత్తమైంది. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. 

ఏకంగా 40 మంది వైద్య బృందం ఈ ఆపరేషన్‌లో భాగమయ్యారు. స్థానిక డిఎస్పి తన సిబ్బందితో ట్రాఫిక్ ని క్లియర్ చేయించి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నిర్ణీత సమయాలలో అవయవాలు గమ్యస్థానాలకు చర్చించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం అవయవదాత చరితకు పలు రకాల పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం భారీగా తరలివచ్చిన జనాల మధ్య ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పేరుకు తగ్గట్టే చరిత చరిత్రలో నిలిచిపోతుందని, ఆమె త్యాగం ఎన్నో కుటుంబాలలో వెలుగుల నింపిందని అందరూ కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ఆమె కుటుంబ సభ్యులు సైతం అవయవధానానికి సంసిద్ధత వ్యక్తం చేయడం ప్రశంసనీయమంటూ వైద్యులు, పోలీసులు ప్రశంసించారు. గుంటూరు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి ఊపిరితిత్తులను, నెల్లూరు అపోలో ఆసుపత్రికి ఒక కిడ్నీని , మరొక కిడ్నీ కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోనే కిడ్నీ మార్పిడి చేశారు. కర్నూలులో ఇలాంటి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగడం మొదటిసారి కావడం గమనార్హం.

Published at : 05 Jul 2022 08:24 PM (IST) Tags: telangana news Kurnool news Andhra Pradesh news organ donation

సంబంధిత కథనాలు

AP Agri Gold  :   ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

సంక్రాంతి నుంచి ఫ్యామిలీ డాక్టర్ - వైద్యులను నియమించుకుంటున్నామన్న ఏపీ ప్రభుత్వం !

సంక్రాంతి నుంచి ఫ్యామిలీ డాక్టర్ - వైద్యులను నియమించుకుంటున్నామన్న ఏపీ ప్రభుత్వం !

Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ

Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!