By: ABP Desam | Updated at : 05 Mar 2023 04:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంచు మనోజ్ దంపతులు
Manchu Manoj Couple : హీరో మంచు మనోజ్ కుమార్ దంపతులు కర్నూలులో సందడి చేశారు. మనోజ్, భూమా మౌనికా రెడ్డికి వివాహమైన సందర్భంగా మౌనికా రెడ్డి తాత మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కలిసేందుకు కర్నూలు వచ్చారు. వీరితో పాటు తెలంగాణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారు. కర్నూలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం అనంతరం కర్నూలు నుంచి ఆళ్ళగడ్డకు వెళ్లారు. అక్కడ భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఘాట్ వద్ద మంచు మనోజ్ దంపతులు నివాళులు అర్పించారు.
తొలిసారి అత్తారింటికి మనోజ్
వివాహం అనంతరం మంచు మనోజ్, మౌనిక రెడ్డిలు కర్నూలులోని అత్తగారింటికి చేరుకున్నారు. పెళ్లి తర్వాత తొలిసారి తన భార్య మౌనికతో కలిసి మనోజ్ అత్తారింటికి వచ్చారు. మంచు లక్ష్మీ ఇంటి నుంచి భారీ కాన్వాయ్ తో కొత్త దంపతులు కర్నూలుకు వచ్చారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద మనోజ్ దంపతులకు అభిమానులు ఘనంగా వెల్ కమ్ చెప్పారు. కర్నూలు వెళ్లగానే ముందుగా మౌనిక తాత ఎస్వీ సుబ్బారెడ్డి (శోభా నాగిరెడ్డి తండ్రి) ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.... మీ అందరి ఆశీస్సులతో మౌనికతో వివాహం జరిగిందన్నారు. కర్నూలు నుంచి ఆళ్లగడ్డ, కడప ఆ తర్వాత తిరుపతికి వెళ్లనున్నట్లు తెలిపారు.
ఇటీవల పెళ్లి
యువ కథానాయకుడు మంచు మనోజ్ (Manchu Manoj) మళ్ళీ ఓ ఇంటి వాడు అయ్యారు. ఈ నెల 3వ తేదీన... శుక్రవారం రాత్రి 8.30 గంటలకు శుభ ముహూర్తాన భూమా నాగ మౌనిక రెడ్డి (Bhuma Naga Mounika Reddy) మెడలో మూడు ముడులు వేశారు. ఆమెతో ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో కన్నుల పండుగగా పెళ్లి జరిగింది. మౌనిక కంటే ముందు లక్ష్మీ ప్రణతిని ప్రేమ వివాహం చేసుకున్నారు మనోజ్. కొన్ని రోజులకు విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో భూమా నాగ మౌనికా రెడ్డి మొదటి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ధీరవ్ రెడ్డి. ఇప్పుడు ఆ బాబు బాధ్యతను కూడా మనోజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండో వివాహం
హీరో మంచు మనోజ్, మౌనిక రెడ్డి వివాహం మార్చి 3న ఫిల్మ్ నగర్లో మంచు లక్ష్మి నివాసంలో గ్రాండ్ గా జరిగింది. ఇరువురి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు మనోజ్ పెళ్లికి హాజరై నవ దంపతులను ఆశీర్వాదించారు. పెళ్లి అనంతరం కొత్త జంట ముందుగా కర్నూలు వెళ్లారు. మనోజ్ మౌనిక రెడ్డితో కలిసి అత్తారింటికి బయలుదేరిన ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2015లో హీరో మనోజ్ కు ప్రణతిరెడ్డితో వివాహం జరిగింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. భూమా మౌనికరెడ్డికి కూడా గతంలో బెంగుళూరుకు చెందిన ఓ బిజినెస్ మెన్ తో పెళ్లి జరిగి డివోర్స్ అయ్యాయి. ఇరువురికీ ఇది రెండో వివాహం.
Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!
Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాలకృష్ణ
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి