అన్వేషించండి

Kukkala Vidyasagar Arrest : హీరోయిన్ జెత్వానీ కేసులో కీలక పరిణామం - డెహ్రాడూన్‌లో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్

heroine Jethwani case : హీరోయిన్ కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు.

Kukkala Vidyasagar arrested in Dehradun in heroine Jethwani case : హీరోయిన్ జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. జెత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైన తర్వాత ఆయన పరారాయ్యారు. తన  ఫోన్  స్విచ్చాఫ్ చేసి.. తన స్నేహితుడి ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్ పై నిఘా పెట్టిన పోలీసులు ఆయన డెహ్రాడూాన్ లో ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడకు వెళ్లి అరెస్టు చేసి తీసుకు వస్తున్నారు. 

గత ఫిబ్రవరిలో ముంబై నటి జెత్వానీ అరెస్ట్            

ముంబైకి చెందిన హీరోయిన్ జత్వానీని గత ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. తన పొలాన్ని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించిందని.. వేరే వ్యక్తి దగ్గర ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చి రూ. ఐదు లక్షలు తీసుకుని ఒప్పందం చేసుకుందని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పెద్ద ఎత్తున పోలీసుల టీం మంబై వెళ్లింది. రెండు రోజుల పాటు నిఘా పెట్టి ఆమె కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. చిన్న చిన్న నేరాల్లోనే ప్రెస్ మీట్లు పెట్టే పోలీసులు ముంబైలో టెర్రరిస్టు తరహాలో అరెస్టు చేసి తీసుకు వచ్చిన హీరోయిన్ జత్వానీ విషయాన్ని మాత్రం బయటకు తెలియనివ్వలేదు. దాదాపుగా నెలన్నర తర్వాత ఆమెకు  బెయిల్ రావడంతో ముంబైకి వెళ్లారు. 

ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం

ప్రభుత్వం మారిన తర్వాత తనపై వేధింపుల విషయాన్ని బయట పెట్టిన నటి      

ప్రభుత్వం మారిన తర్వాత ముంబై నటిని విజయవాడ పోలీసులు వేధించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ఈ వార్తలు రావడంతో.. ముంబై నటి జత్వానీ స్పందించారు. విజయవాడ పోలీసులు తన విషయంలో వ్యవహరించిన విధానాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తర్వాత విజయవాడకు వచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసులు.. జత్వానీ పై కేసు పెట్టక ముందే  .. అరెస్టు చేయడానికి ఏర్పాట్లు చేశారని గుర్తించారు. అలాగే కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు కూడా తప్పుడుదేనని గుర్తించారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో .. పొలాన్ని అమ్మకానికి పెట్టిందని చెప్పిన వ్యక్తులు .. తమకు అసలు జత్వానీనే తెలియదని పోలీసులకు చెప్పారు. 

Also Read: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ 

తమకు జత్వానీ తెలియదని.. తమకు పొలం అమ్మకానికి పెట్టలేదని.. తాము ఎవరికీ డబ్బులివ్వలేదన్నారు. శ్రీవారి దర్శనం కోసం టిక్కెట్లు ఇప్పిస్తామంటే తమ ఆధార్ కార్డులు కుక్కల విద్యాసాగర్ అడిగితే ఇచ్చామని .. అంతకు మించి తమకేమీ తెలియదన్నారు. అలాగే పోలీసులు ఫిర్యాదులో .. జెత్వానీ ఫోర్జరీ చేసిందని  చెబుతున్న డాక్యుమెంట్ ను కూడా ఇక్కడే తయారు చేశారని గుర్తించారు. దీంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఇప్పటికే  ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కుక్కల విద్యాసాగర్ ను ప్రశ్నించిన తర్వాత వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget