అన్వేషించండి

AP Vs Odissa : అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

కొఠియా గ్రామాల్లోకి ఏపీ అధికారులు రాకుండా ఒరిస్సా అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. ఆ గ్రామాలు తమవేనని ఒరిస్సా అంటోంది. కానీ తమవని ఏపీ వాదిస్తోంది.


ఆంధ్రప్రదేశ్ - ఒరిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో సోమవారం ఏర్పడిన ఉద్రిక్తత అందర్నీ ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణం కొద్ది రోజుల కిందట అస్సాం- మిజోరం రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలే. నిజానికి ఆ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం లాంటిదే ఏపీ - ఒరిస్సా మధ్య ఉంది. ఆ సమస్యే కొఠియా గ్రామాలు. 

అస్సాం - మిజోరం సరిహద్దు వివాదం తరహాలోనే ఏపీ- ఒరిస్సా మధ్య కొఠియా గ్రామాల సమస్య..!

అస్సాం - మిజోరం రాష్ట్రాల మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు ఇంకా కళ్ల ముందే ఉన్నాయి. మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ వివాదానికి కారణం సరిహద్దు. 1972 వరకు అస్సాంలో మిజోరం ఒక భాగం.  విడిపోయిన తర్వాత రెండురాష్ట్రాల మధ్య 165 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కానీ అస్సాంలోని కొంత భాగం తమదని మిజోరం వాదిస్తుంది. కాదు మిజోరంలో కొంత భాగం తమదని అస్సాం వాదస్తోంది. దీంతో సరిహద్దు వివాదం అంతకంతకూ పెరిగిపోయింది. చివరికి అది ఘర్షణలకు దారి తీసింది. ఇప్పుడు అంత తీవ్రంగా కాకపోయినా అలాంటి పరిస్థితులు భవిష్యత్‌లో ఏర్పడటానికి పునాదులు ఆంధ్రప్రదేశ్ - ఒడిషా సరిహద్దుల్లో ఏర్పడ్డాయి. గ్రామాల్లో బారీకేడ్లను ఏర్పాటుచేయడం.. అధికారుల్ని .. ప్రజాప్రతినిధుల్ని వెనక్కి పంపేశారు. దీంతో వివాదం ముదిరింది. AP Vs Odissa :  అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

ఏపీ అధికారులు అడుగు పెట్టకుండా కంచెలు నిర్మించిన ఒరిస్సా ప్రభుత్వం..!

ఒడిషా ఇలా సరిహద్దుల్లో గ్రామాల్లో ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగు పెట్టకుండా చేసింది కొఠియా గ్రామాల్లో. ఆ కొఠియా గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంది. కానీ శాంతిభద్రతల పేరుతో ఒరిస్సా బలగాలను రంగంలోకి దించింది. బారికేడ్లను ఏర్పాటు చేసి రహదారి మూసివేసింది.  రెండు గ్రామాలను ఒరిస్సా పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు.  ఆ గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. అధికారులు బలగాలే కాదు...  ఒరిస్సాకు చెందిన రాజకీయ పార్టీలకు చెంది నేతలు కూడా ఆ గ్రామాలకు వచ్చారు. ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొఠియా గ్రామాలు ఒడిశా మట్టి అడుగు పెడితే ఒప్పుకోబోమని హెచ్చరికలు జారీ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నార. ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొఠియాను వదులుకోబోమని ప్రతిజ్ఞ చేశారు. ఒడిషా దూకుడు చూసి ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్కడ చేపట్టాలనుకున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలను వాయిదా వేసింది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా గొడవలు జరికాయి. పోలింగ్ నిర్వహించేందుకు ఒడిషా అధికారులు అంగీకరించలేదు. అప్పుడు కూడా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. 

సుప్రీంకోర్టు, పార్లమెంట్ కూడా పరిష్కరించలేకపోయిన సమస్య..! 

ఆంధ్రప్రదేశ్ - ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న  విజయనగరం జిల్లా - కోరాపుట్‌ జిల్లాల మధ్య 21 గ్రామాలను కొఠియా గ్రామాలకు పిలుస్తారు. సాలూరు నుంచి 40 కి.మీ.ల మేర అడవులు, కొండల్లో ప్రయాణిస్తే కొఠియా గ్రామాలు కనిపిస్తాయి. అక్కడికి రహదారి సౌకర్యం లేదు. ఈ గ్రామాల్లో జనాభా దాదాపు 15 వేల మంది నివసిస్తూ ఉంటారు. ఈ గ్రామాలు ఎవరివనేదానిపై ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాల మధ్య సుదీర్ఘ కాలం వివాదం ఉంది. కొఠియా పరిధిలోని 21 గ్రామాలు మావని పోరాడుతూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. 1968లో ఒరిస్సా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య జఠిలం నడుస్తునే ఉంది. 2006లో మాత్రం సుప్రీం కోర్టు రెండు రాష్ట్రాలూ సమన్వయంతో ముందుకు సాగాలని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.  కానీ ఎలాంటి చర్చలు రెండురాష్ట్రాల మధ్య జరగలేదు. ప్రస్తుతం వివాదం సుప్రీం కోర్టులో ఉన్నట్లే. 


AP Vs Odissa :  అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

అక్కడ అందరూ రెండు రాష్ట్రాల పౌరులే..! 

రెండురాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం.. పథకాలు అందించడం వంటివి చేస్తున్నాయి.  తాము ఒడిశాకు చెందుతామా లేక ఆంధ్రాకు చెందుతామా అన్నది అక్కడున్న వారికి సైతం స్పష్టత లేకుండా పోతోంది. రెండు  రాష్ట్రాలు ఇచ్చే సాయాన్ని వారు తీసుకుంటున్నారు. కొఠియా గ్రామాలపై ఒరిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌  ప్రత్యేకంగా దృష్టిసారించారు. భారీగా నిధులు కేటాయించారు. ఆ గ్రామాలు తమవేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నా అక్కడ తెలుగు బోర్డులే కనిపించవు. ఒరిస్సా ప్రభుత్వ బోర్డులు..  భవనాలు కనిపిస్తూ ఉంటాయి. కొఠియా ప్రాంతంలో భారీ ఎత్తున్న అభివృద్ధి పనులు అక్కడి ప్రభుత్వం చేపడుతూ వస్తోంది. ఆ స్థాయిలో ఏపీ ప్రభుత్వం చేపట్టడం లేదు. ఇటీవలి కాలంలో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.  ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇదే జిల్లాకు చెందినా ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఇటీవల అక్కడ పర్యటించి.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒరిస్సా అదికారులు, నేతలు అడ్డుకుంటున్నారు. అదే సమయంలో ఒరిస్సాకుచెందిన  అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, విపక్ష నేతలు, ఉన్నతాధికారులు క్యూకట్టారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. నిత్యం సభలు, సమావేశాలతో హడావుడి చేస్తున్నారు. దీంతో అ గ్రామాలు ఒరిస్సావేనన్న అభిప్రాయం బలపడేలా పరిస్థితి మారుతుంది. 

కొఠియా ప్రాంతంలో అపారమైన సంపద

ఆ కొఠియా గ్రామాల కోసం రెండు ప్రభుత్వాలు పోరాడటానికి కారణం ఉంది. కొఠియా గ్రామాల్లో విలువైన ఖనిజ సంపద ఉంది.  మాంగనీస్‌, బాక్సైట్‌ తదితర గనులున్నాయి. అద్భుతమైన ప్రకృతి సౌంతర్యం ఉంటుంది. చిన్న చిన్న విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రవాహాలు ఉంటాయి. అందుకే ఒరిస్సా ప్రభుత్వం ఈ గ్రామాలపై దృష్టి పెట్టిందని ఏపీ వైపు నుంచి ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఒడిషా ప్రజాప్రతినిధులు కూడా అదే చెబుతూంటారు. కారణం ఏదైనా రెండురాష్ట్రాల ప్రభుత్వాలు కొఠియా గ్రామాలు తమవంటే తమవని వాదిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని చెబుతున్నాయి. ఈ సమస్యను తీర్చాల్సిన పార్లమెంట్.. అసలు ఈ అంశంపై దృష్టి పెట్టలేదు. 


AP Vs Odissa :  అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

ఇలాగే పట్టుదలలకు పోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం..! 

దేశంలో సరిహద్దు సమస్యలు పెరుగుతున్నాయి. అవి ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నా రాను రాను ఉద్రిక్తతలకు కారణం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అస్సాం - మిజోరం ఉదందమే చక్కని సాక్ష్యం. దేశంలో అనేక రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. మహారాష్ట్ర - కర్ణాటక మధ్య ఉన్నాయి.  ఏపీ - తెలంగాణ మధ్య ఏడు మండలాలపై అప్పుడప్పుడూ వివాదం రేగుతూనే ఉంటుంది. ఇవన్నీ చాలా వరకూ పరిష్కారమైన సమస్యలు లేదా... చర్చలతో పరిష్కారమయ్యే సరిహద్దు సమస్యలే. అయితే రాజకీయం కోసం మాత్రమే తెరపైకి తెస్తూ ఉండటం వల్ల ఆ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి.  వీటికి తెరపడితే దేశంలో అంతర్గత ఇబ్బందులు .. రాష్ట్రాల మధ్య గొడవలు చాలా వరకూ తగ్గిపోతాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget