అన్వేషించండి

Btech Ravi: బీటెక్ రవికి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టేసిన కోర్టు

Btech Ravi Custody Petition: పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్‌ రవిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది.

Btech Ravi Custody Petition: పులివెందుల (Pulivendula) టీడీపీ ఇన్‌ఛార్జి (TDP Incharge), మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్‌ రవి (Btech Ravi)ని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కడప కోర్టు (Kadapa Court) కొట్టివేసింది. ఈనెల 14న వల్లూరు పోలీసులు (Vallur Police) బీటెక్‌ రవిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించించిన సంగతి తెలిసిందే. 

తాజాగా బీటెక్ రవిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వల్లూరు పోలీసులు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే బీటెక్‌ రవి బెయిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ (Bail Petition)పై కడప కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈనెల 21న విచారణ చేపడతామని పేర్కొంది.

14న బీటెక్ రవి అరెస్ట్
మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్‌ రవిని ఈనెల 14న అరెస్టు చేశారు. గతంలో నారా లోకేష్ (Nara Lokesh) వైఎస్సార్ జిల్లా పర్యటన (YSR District) సందర్భంగా కడప ఎయిర్ పోర్ట్ (Kadapa Airport) వద్ద పోలీసులపై బీటెక్ రవి దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ (DSP Sharif) తెలిపారు. 

అదే రోజు రాత్రి డీఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. లోకేష్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని తెలిపారు. దానిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు వివరించారు. పది నెలలుగా బీటెక్‌ రవి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు అరెస్టు చేశామని తెలిపారు.

అప్పుడు ఏం జరిగిందంటే?
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో బీటెక్‌ రవి కడప విమానాశ్రయం చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. 

దీంతో బీటెక్ రవి పోలీసులతో ఆయనకు వాగ్వాదానికి దిగారు. పోలీసులు, టీడీపీ కార్యర్తల మధ్య తోపులాట జరిగింది. ఘటనపై వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో మొత్తం వ్యవహారం బీటెక్‌ రవి చుట్టూనే చేరింది. 

యోగివేమన యూనివర్శిటీ సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఓ వాహనంలో బీటెక్‌ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు డ్రైవరు, గన్‌మెన్‌, ఇతర సహాయకుల ఫోన్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో బీటెర్ రవి, సెక్యూరిటీ, అనుచరుల ఫోన్లు పనిచేయక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పార్టీ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు. 

ఆ తరువాత కొద్ది సేపటికి పోలీసులు బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దాదాపు గంట తర్వాత పోలీసుల అదుపులో ఉన్న గన్‌మెన్‌, డ్రైవర్‌, వ్యక్తిగత సహాయకులను వదిలిపెట్టి అందరి ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. తర్వాత రవిని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రికి రాత్రి పది గంటలకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. బుధవారం రిమాండ్ విధించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget