అన్వేషించండి

Devara: 'దేవర' సినిమా చూసి చనిపోతా' - జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆఖరి కోరిక, కొడుకు దీన స్థితి చూసి తల్లి వేడుకోలు

Andhra News: బోన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఓ యువకుడు తన అభిమాన నటుడు ఎన్టీఆర్ 'దేవర' సినిమా చూడాలని కోరుకుంటున్నాడు. అంత వరకూ తనను బతికించాలని వైద్యులను వేడుకుంటున్నాడు.

Junior NTR Fan Request To See Devara Movie: ఆ యువకుడు జూనియర్ ఎన్టీఆర్‌కు (Junior NTR) వీరాభిమాని. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న అతను.. తాను చనిపోయే లోపు తన అభిమాన నటుడి సినిమా 'దేవర' (Devara) చూసి చనిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ బిడ్డ ఆఖరి కోరిక తీర్చాలని ఆ యువకుని తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. ఏపీకి చెందిన కౌశిక్ (19) కొద్ది రోజులుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'దేవర' చూడాలని తన బిడ్డ కోరుకుంటున్నట్లు.. అప్పటివరకూ అతన్ని బతికించాలని వైద్యులను వేడుకుంటున్నట్లు కౌశిక్ తల్లిదండ్రులు తెలిపారు. కాగా, యువకుడి తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతి (Tirupati) ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 'నా కుమారుడు చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇప్పుడు కూడా చివరి కోరికగా 'దేవర' సినిమా చూడాలని అడుగుతున్నాడు. సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. ఇది అతని ఆఖరి కోరిక.' అంటూ కౌశిక్ తల్లి సరస్వతి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుని వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చవుతుందని.. ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని తాము ప్రయత్నిస్తున్నామని.. తమకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే స్నేహితులు, సన్నిహుతుల ద్వారా కొంత డబ్బు సమకూరినా ఇంకా డబ్బు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న తారక్ అభిమానులు ఆయన్ను ట్యాగ్ చేస్తున్నారు. కాగా, తనను ప్రేమించే అభిమానులన్నా, వారి కుటుంబ సభ్యులన్నా తారక్ ఎంతో అభిమానం, ప్రేమను కనబరుస్తుంటారు. గతేడాది ఓ అభిమాని తన తల్లికి ఆయనంటే ఎంతో ఇష్టమని చెప్పగా.. తారక్ ఆమెతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఆ అభిమాని కోరిక తీర్చారు.

Also Read: Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget