News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jayasudha : ఢిల్లీలో జయసుధ - అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం

నేడు జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇందు కోసం ఆమె ఢిల్లీ చేరుకున్నారు.

FOLLOW US: 
Share:

Jayasudha :   మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ బీజేపీలో చేరిక ఖరారయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారమే ఆమె  కాషాయ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే  ఆమె ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం ప్రధాన నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరుఫున గతంలో జయసుధ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

గత వారం కిషన్ రెడ్డితో జయసుధ భేటీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,  కేంద్ర మత్రి కిషన్ రెడ్డితో జయసుధ సమావేశం అయ్యారు. పార్టీలో చేరికపై వీరి మధ్య చర్చలు జరిపారు.   2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. తర్వాత ఓడిపోయారు. ఇక సైలెంట్ అయిపోయారు. వ్యక్తిగత సమస్యలతో కొన్నాళ్లుగా సినిమాలకూ దూరంగా ఉంటున్నారు. ఇటీవల మళ్లీ  యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వైసీపీలోనూ చేరారు. గత ఎన్నికలకు ముందు  వైసీపీలో చేరారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి , కిషన్  రెడ్డి చర్చలు జరపడంతో బీజేపీలోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. 

కాంగ్రెస్ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపు 

గతంలో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జయసుధ చాలా రాజకీయ పార్టీలు మారారు.  2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరవాత కొన్నాళ్ళకి టిడిపిలోకి చేరారు. గత ఎన్నికలకు ముందు  వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.   అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించడానికి ఒక ట్రస్ట్ ను కూడా ప్రారంభించి సేవలు అందిస్తున్నారు.   . ఈ సారి బీజేపీ తరపున ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అప్పుడే అయిపోలేదు 'బ్రో', ఇప్పుడే మొదలైంది అంటున్న అంబటి

ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం 
                            
జయసుధ సినిమా నటిగానే కాకుండా.. సికింద్రాబాద్ చుట్టుపక్కల అత్యధికంగా ఉండే ఓ మతం అభిమానాన్ని పొందారన్న అభిప్రాయం ఉంది. అందుకే సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ ఉందని భావిస్తున్నారు. గతంలో ముషీరాబాద్ నుంచి బీజేపీ తరపున సీనియర్ నేత కె. లక్ష్మణ్ పోటీ చేసేవారు.ఆయన ఇప్పుడు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ బీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. ఆయన లేకపోతే.. ఆయనకు బదులుగా బలమైన అభ్యర్థి జయసుధ అయితేనే  బాగుటుందని.. బీజేపీ వర్గాలు అంచనాకు వచ్చి ఆమెతో సంప్రదింపులు జరిపినట్లగా తెలుస్తోంది.    

తండ్రి లేని పిల్లాడని జగన్ ని గెలిపించారు, కానీ ఈసారి గెలుపు మనదే: పవన్ కల్యాణ్

వైసీపీలో జయసుధకు దక్కని పదవులు                      

జయసుధ వైసీపీలో చేరినప్పటికీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. కనీసం పార్టీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని.. ఆ పార్టీలో లేనట్లేనని గతంలో వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ నుంచి  వైసీపీలో చేరిన చాలా మందికి పదవులు వచ్చాయి. ధర్టీ ఇయర్ ఫృధ్వీకి పదవి ఇచ్చారు కానీ మధ్యలో బయటకు పంపేయడంతో ఆయన సైడ్ అయ్యారు. తర్వాత పోసాని కృష్ణమురళి, అలీ, జోగి నాయుడుకు కూడా పదవులు వచ్చాయి. సీనియర్ నటుడు మోహన్ బాబు, జయసుధలను మాత్రం సీఎం జగన్ ఎందుకో పట్టించుకోలేదు.దీంతో వీరిద్దరూ వైసీపీకి దూరమయ్యారు. 

Published at : 02 Aug 2023 12:44 PM (IST) Tags: Jayasudha Telangana Politics Jayasudha into BJP Jayasudha politics

ఇవి కూడా చూడండి

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

Nara Lokesh: నారా లోకేష్ కీలక నిర్ణయం, రేపు ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష

Nara Lokesh: నారా లోకేష్ కీలక నిర్ణయం, రేపు ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

టాప్ స్టోరీస్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

Hyper Aadi: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్

Hyper Aadi: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్

LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు

LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు