అన్వేషించండి

Pawan Kalyan: 'సీఎం జగన్ అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదం' - టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న పవన్ కల్యాణ్

Andhrapradesh Politics: సీఎం జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Pawan Kalyan Comments on CM Jagan: సీఎం జగన్ (CM Jagan) తనను తాను అర్జునుడిలా పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (Balashauri) జనసేనలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'అర్జునుడు ఆడపడుచుల్ని రక్షించాడు కానీ, ఎప్పుడూ తూలనాడలేదు. సొంత చెల్లి గురించి నీచంగా మాట్లాడుతుంటే ప్రోత్సహించే వ్యక్తి జగన్. సొంత బాబాయిని చంపేసిన నిందితుల్ని వెనకేసుకొస్తాడు. వివేకా కుమార్తె సునీత తనకు రక్షణ లేదని చెబుతున్నా పట్టించుకోడు. అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. మేమంతా కౌరవులలాగా జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.. ఇక్కడ అర్జునులు ఉండరు, కృష్ణులు ఉండరు. నేను పవన్.... ఆయన జగన్ మాత్రమే. ఇష్టానుసారం హిందూ పురాణాల్లోని వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం  మంచిది కాదు. మీది వైసీపీ, మాది జనసేన ఎవరు మంచి చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.' అని పవన్ పేర్కొన్నారు.

వైసీపీపై విమర్శలు

'నన్ను ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా, నోటికొచ్చినట్లు తిట్టినా నేను స్పందించకపోవడానికి కారణం ఉంది. ఇప్పటికే రాజకీయాల పట్ల ఒక రకమైన ఏహ్యభావం యువతలో ఉంది. నేను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఒక తరానికి రాజకీయాల మీద విరక్తి, విసుగు పుడుతుంది. ఈ కారణంతోనే హుందా రాజకీయాలు చేయాలని, హుందాగా మాట్లాడాలనే నా కోపాన్ని, ఆవేశాన్ని నాలోనే దాచుకుంటాను. దిగజారి రాజకీయాలు చేయడంలో వైసీపీ ముందుంది. గతంలో రాజకీయాలు వెగటుగా ఉన్నా కొన్ని మంచి సంప్రదాయాలు ఉండేవి. వైసీపీ వచ్చాక రాజకీయాలు దిగజారిపోయాయి. దేశంలోనే వైసీపీ దిగజారుడు రాజకీయాలు చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని వైసీపీ నాయకులు కావాలనే తీసుకొచ్చారు.' అని పవన్ అన్నారు. 

'ప్రజా కూలీ అని పిలవండి'

పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని.. అడ్డదారులు తొక్కి  అడ్డగోలుగా సంపాదించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని పవన్ తెలిపారు. 'నన్ను పవర్ స్టార్ అని పిలిస్తే అంతగా నచ్చదు. పవర్ స్టార్ అనే కంటే ప్రజా కూలీ అని పిలిస్తే చాలా ఆనందిస్తాను. నాకు మొదటి నుంచి ఆశలు, భయాలు లేవు. ప్రజలకు బలంగా నిలబడాలన్న ఆకాంక్షే నడిపిస్తోంది. పార్టీని ఓ ఉన్నతమైన లక్ష్యంతో, సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తున్నాను.' అని చెప్పారు. జనసేనలోకి ఎంతో అనుభవం ఉన్న నాయకులు శ్రీ వల్లభనేని బాలశౌరి రావడం ఆనందంగా ఉందని అన్నారు. 

'జగన్ అబద్ధాలకు అంతు లేదు'

'రాష్ట్రం అంతా సిద్ధం... సిద్ధం అంటూ పోస్టర్లతో వైసీపీ హంగామా చేస్తోంది. దేనికి సిద్ధమో? ఎందుకు సిద్ధమో? ఎవరికి అంతుపట్టడం లేదు. జగన్ చెప్పినన్ని అబద్ధాలు బహుశా ఎవరూ చెప్పి ఉండరు. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, మద్య నిషేధం... ఇలా చెప్పుకుంటూపోతే జగన్ అబద్ధాల లిస్టుకు అంతే ఉండదు. లక్షల మందిని కూడగట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి సభలు చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ సభలు పెడుతున్నారు. మేము కూడా ఎన్నికల సంగ్రామంలో దిగబోతున్నాం. రోజు మీకు సవాల్ విసురుతాం. మీరు జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తాం. మీరు సిద్ధంగా ఉంటే అంతులేని భయాన్ని ఇస్తాం. సిద్ధంగా ఉండండి.  నేను కూడా అన్నిటికి సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చాను. ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే చావో రేవో తేల్చుకుంటాను.' అని స్పష్టం చేశారు.

'ప్రతి సీటూ గెలవాలి'

'2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం పార్టీల బలమైన ప్రజా ప్రభుత్వం రాబోతోంది. విజయం తేలికగా కాదు. బలమైన పోరాటం అవసరం. శత్రువు ఎన్ని మోసాలతో అయినా మళ్లీ అధికారంలోకి రావడానికి పన్నాగాలు పన్నుతాడు. జగన్ మోసాలను జయించి విజయం సాధించాలి. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో జనసేన బలమైన పాదముద్ర ఉంటుంది. నేను సైలెంటుగా ఉన్నాను... అంతా నిస్తేజంగా ఉందని జనసైనికులు, వీర మహిళలు అనుకోవద్దు. ప్రతి మౌనం వెనుక బలమైన వ్యూహం దాగి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి చోట కచ్చితంగా గెలుపు ఉండాలనే లక్ష్యంతోనే ప్రణాళికలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసిన దగ్గర గెలిచి తీరాల్సిందే. జగన్ దుర్మార్గం మళ్లీ వస్తే రాష్ట్రాన్ని రక్షించడం అసాధ్యం. ఐదేళ్లలోనే రాష్ట్రం పరిస్థితి ఇంత దిగజారిపోతే.. మరోసారి జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడండి. స్ధానిక సంస్ధల స్థాయి పదవులు నుంచి రాష్ట్ర స్థాయి పదవులు వరకు అందరికీ... శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఎవరినీ మరిచిపోయేది లేదు. ఎవరికీ అన్యాయం జరగదు. పడిన ప్రతీ కష్టానికీ తగిన గౌరవం ఇచ్చే బాధ్యత నాది. మరోసారి దుర్మార్గ పాలన రానీయకుండా సమష్టిగా పనిచేసి ప్రజా పాలనకు పునాదులు వేద్దాం' అని జనసేనాని పిలుపునిచ్చారు.

Also Read: MP Balashauri: జనసేనలోకి ఎంపీ బాలశౌరి - సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget