అన్వేషించండి

YS Jagan : ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పోరాటం - హైకోర్టులో పిటిషన్

Andhra Pradesh : ప్రతిపక్ష నేత హోదా ఇప్పించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ ను ఆదేశించాలని కోరారు.

Jagan Fights For Leader of Opposition Status :  ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తానే ప్రతిపక్ష నాయకుడ్నని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో స్పీకర్ కు లేఖ రాశారు. తాజాగా ఆ హోదా ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఆయనను వైసీపీ ఫ్లోర్ లీడర్ గానే గుర్తించారు. దీంతో వెంటనే జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‍ ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్‍లో జగన్ పేర్కొన్నారు. 

ఏపీలో అధికార పార్టీ కాకుండా ఉన్న మరో పార్టీ తమదేనని  జగన్ చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ  విరుద్ధమని వాదిస్తున్నారు. అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో పది శాతం సీట్లు ఉంటేనే  ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదని జగన్ ఇంతకు ముందు స్పీకర్‌కు లేఖ రాశారు. మామూలుగా అయితే పది శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. రెండు, మూడు పార్టీలకు పది శాతం కన్నా ఎక్కువ సీట్లు వస్తే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తిస్తారు. కానీ ఏపీలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది. కనీసం పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే ఇలా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను అడగాల్సి వచ్చేది కాదు. 

కానీ స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వాలని జగన్ అడుగుతున్నారంటేనే.. నిబంధనల ప్రకారం ఆయనకు రావాల్సిన సీట్లు రాలేదని అర్థం అవుతుందని.. అలాంటి రూల్ లేనప్పుడు అడగాల్సిన అవసరం ఏముందని ..  ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నేత హోదా వస్తుంది కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గత 2014, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పది శాతం సీట్లు రాలేదు. అందుకే ఆ పార్టీ పక్ష నేతను ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గానే పార్లమెంట్ లో ఆ పార్టీ నేత వ్యవహరించారు.                         

తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని  గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన తీర్పు రాలేదు. స్పీకర్ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశం లేదని న్యాయనిపుణలు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోర్టు ఆదేశించినా.. స్పీకర్ పాటించాల్సిన అవసరం లేదని.. శాసన వ్యవస్థను న్యాయవ్యవస్థ ఆదేశించలేదని అంటున్నారు. ముఖ్యంగా సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేరని చెబుతున్నారు. మొత్తంగా జగన్పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget