Ganja Fact Check : గంజాయి స్మగ్లింగ్‌లో ఏపీనే టాప్ ! నిజమెంత ? ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఏం చెబుతోంది ?
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న గంజాయిలో అత్యధికం ఏపీ నుంచే స్మగ్లింగ్ అవుతోందా ? ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఏం చెబుతోంది ?
Ganja Fact Check : దేశవ్యాప్తంగా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని ఏపీ పోలీసులు నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఖండించింది. వరుసగా పోస్ట్‌లు చేస్తోంది. అసలు ఏది నిజమో ఓ సారి చూద్దాం.
నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రిపోర్టు ప్రకారం ఏపీనే గంజాయి స్మగ్లింగ్‌లో టాప్ !
ఆంధ్రప్రదేశ్‌లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో 26.75% ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పొరుగు రాష్ట్రం ఒడిశా (1,71,713 కిలోలు) ఉంది. దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయిలో 50% ఈ రెండు రాష్ట్రాల్లోనిదే. ఏవోబీలో పెద్ద ఎత్తున గంజాయిని సాగు చేస్తూండటమే దీనికి కారణం.
ఏపీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు !
ఎన్‌సీబీ రిపోర్టుతో ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ఏడాది ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దొరుకుతున్న గంజాయి కేసులు వెలుగు చూశాయి. పలువురు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతోందని అన్నారు. ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా రేగింది. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. గంజాయి స్మగ్లింగ్‌లో వైఎస్ఆర్‌సీపీ నేతల హస్తం ఉందని విపక్ష నేతలు ఆరోపణలు ప్రారంభించారు.
ఆ ఫోటో పాతదన్న ఫ్యాక్ట్ చెక్ ఏపీ !
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం అయ్యే ఫేక్ న్యూస్ గురించి ఫ్యాక్ట్ చెక్ చేసే ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఈ అంశంపై స్పందించింది. ఆ వార్త వచ్చిన ఫోటో .. తప్పుడు సమాచారం అని.. యూఎస్ నుంచి దిగుమతి చేసుకున్న అంశమని వివరించారు. అయితే ఇందులో కూడా నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రిపోర్టు గురిచి ప్రస్తావించలేదు. ఈ కారణంగా చాలా మంది నెటిజన్లు... వార్త కరెక్టే.. ఫోటో తప్పా అని ఫ్యాక్ట్ చెక్ ఏపీని ప్రశ్నించారు.
Photos from a seized Ganja imported from US, is being peddled as Andhra Pradesh. The photo has also been enhanced with misleading context.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) September 29, 2022
Article Link: https://t.co/gycq4wjyW8 https://t.co/8HMBspSMyL pic.twitter.com/AkBGtgWxGH
ఆ తర్వాత కాసేపటికే ఫ్యాక్ట్ చెక్ ఏపీ మరో ట్వీట్ చేసింది. గంజాయి రవాణా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించింది.
Operation Parivartan by @APPOLICE100
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) September 29, 2022
- burned 2 lakh KGs of Ganja
- 1500 accused arrested (562 from other states)
- Seized 47,986.934 kgs ganja, 46.41 litres hashish oil, 314 vehicles
- destroyed 7,552 acres of ganja cultivation
- 1,963 awareness campaigns
- 120 checkposts pic.twitter.com/ePDMQd0cSc
ఎన్‌సీబీ రిపోర్టు ప్రకారం.. పట్టుబడుతున్న గంజాయిలో అత్యధికం ఏపీ నుంచి వస్తున్నదని అధికారిక రికార్డుల్లో ఉంది. ఈ విషయాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఖండించలేదు.