CM Jagan Banks : పథకాల అమలు.. అభివృద్ధిలో తోడుగా రండి.. బ్యాంకర్లకు సీఎం జగన్ పిలుపు !
పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని సీఎం జగన్ కోరారు. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంక్షేమ పథకాల అమల్లో తోడుగా ఉండాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో సీఎం ప్రసంగించారు. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గడం.. ఖర్చులు పెరగడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని సీఎం జగన్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గట్టెక్కించగలిగిందని.. అందుకు బ్యాంకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలంలోనే బ్యాంకులు లక్ష్యంలో 60.53 శాతం అంటే రూ.1,71,520 కోట్ల రుణాలు బ్యాంకులు పంపిణీ చేశాయని జగన్ తెలిపారు. అయితే వ్యవసాయ మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ రంగాలల్లో రుణాల మంజూరు పెంచాలని కోరారు. లో రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాల్సి ఉంది. బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు తగ్గాయన్నారు. వాటిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.
పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని.. లబ్దిదారులకు మరో రూ.35 వేల చొప్పున బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చింది కాబట్టి, అవసరమైతే వాటిని తనఖా పెట్టుకోవాలని సూచించారు. ఆ రుణాలపై 3 శాతం వడ్డీ లబ్దిదారుల నుంచి వసూలు చేస్తే మిగతాది ప్రభుత్వం కడుతుందన్నారు. 2,62,216 టిడ్కో ఇళ్ల కు సంబంధించి బ్యాంకులు కాస్త చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
Also Read : ఏపీ ఉద్యోగసంఘాల మధ్య చీలిక.. ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న కొన్ని సంఘాలు !
ఎంఎస్‌ఎంఈల రుణాలను రీ స్ట్రక్చర్ చేయడంలో మరింత చురుకుగా ఉండాలని జగన్ కోరారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నాలుగైదు ఏళ్ల రాయితీలను చెల్లించామన్నారు. వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి కింద జగనన్న తోడు పథకం ద్వారా వారికి బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్సిస్తోంది. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలని సీఎం కోరారు. వాలంటీర్లు బ్యాంకులకు సహాయ సహకారాలు అందిస్తారని నిరర్థక ఆస్తులను తగ్గించడంలో తోడుగా నిలుస్తారని హామీ ఇచ్చారు.
Also Read : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !
ఏపీలో కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు, మరో 16 నర్సింగ్ కాలేజీలు కడుతున్నామని ఇందు కోసం మొత్తం రూ.12,243 కోట్లు అవసరం కాగా, కొంత రుణం ఇవ్వడానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఇంకా దాదాపు రూ.9 వేల కోట్ల నిధులు కావాలి. అలాగే 15,715 స్కూళ్లను తొలి దశలో రూ.3,500 కోట్లతో సమూలంగా మారుస్తున్నామని.. మొత్తం మూడు దశల్లో అన్ని స్కూళ్ల ను సమూలంగా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో కూడా బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. మహిళలకు అందిస్తున్న పథకాల వల్ల రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా మహిళలు వ్యాపారాల ద్వారా నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు ఆదాయం పొందుతున్నారని ఇలాంటి వాటికి బ్యాంకులు సహకారం అందించాలని కోరారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి