Kadapa: ఇసుక లారీలను అడ్డుకున్న నందలూరు గ్రామస్తులు... ఇసుక మాఫియా కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపణ
కడప జిల్లా చెయ్యేరు నదిలో మళ్లీ ఇసుక తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఇసుక మాఫియా కోసమే అధికారులు ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టారని స్థానికులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు.
కడప జిల్లా చెయ్యేరులో మళ్లీ పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల చెయ్యేరు నది వరదలతో నందలూరు, రాజంపేటలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వరద ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. అన్నమయ్య కట్ట తెగిపోయి చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. వరద గ్రామాలను ముంచెత్తింది. ఇసుక మాఫియా కోసమే అధికారులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెయ్యేరు వరదలు మిగిల్చిన విషాదాన్ని మరవక ముందే మళ్లీ నదిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు.
Also Read: ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
సహాయక చర్యలకు ఆటంకం
ఇసుక ట్రాక్టర్లు, లారీలను గుండ్లూరు, నందలూరు ప్రజలు అడ్డుకున్నారు. సహాయక చర్యలు సాగుతుంటే ఇసుక రవాణా చేస్తూ ఆటంకం కల్గిస్తున్నారని ప్రజల మండిపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వందలాది లారీలు, ట్రాక్టర్లు నిత్యం తిరుగుతున్నాయని అంటున్నారు. సహాయం చేయాల్సిన సమయంలో ఇలా ఇసుక రవాణాకు చేయటం తగదని వరద బాధితులు వాపోతున్నారు. టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న గ్రామస్తులను వారించి పోలీసులు టిప్పర్లు, ట్రాక్టర్లను అక్కడి నుంచి పంపించేశారు.
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
అన్నమయ్య కట్ట తెగిపోయి ఉప్పొంగిన చెయ్యేరు
ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లాలోని రాజంపేట సమీపంలో ఉన్న అన్నమయ్య డ్యామ్ మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లోను వరద ప్రవాహం ముంచెత్తింది. గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. చెయ్యేరు నది వరద పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట గ్రామాల్లోకి పోటెత్తింది. చెయ్యేరు నది పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు.
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
Also Read: పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు... కీచక టీచర్ కు దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి