By: ABP Desam | Updated at : 20 Jul 2023 06:38 PM (IST)
పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి భవిష్యత్‌కు గ్యారంటీ - చంద్రబాబు వినూత్న ఆలోచన !
Chandrababu : ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో అనుకూలంగా మార్చుకునే విధానాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. బూత్ స్థాయి నుంచి ఇన్‌ఛార్జ్ వరకూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేలా రూపొందించిన కార్యాచరణను నేతల ముందు ఆవిష్కరించారు.
పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరి పనితీరుపై అసెస్‌మెంట్
బూత్ స్థాయి నుంచి ఇన్‌ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరి పనితీరుపై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతీ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు కమిటీలు యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాక్ ఆఫీస్ బృందంగా దాదాపు 10మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్, యూనిట్ ఇన్‌ఛార్జ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పనితీరును కమిటీ సభ్యులు మదింపు చేయనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలోనే సరిదిద్దుకునేలా కమిటీలు ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. నాలుగు స్థాయిల్లో ప్రతీ ఒక్కరి పనితీరును పరిశీలించి వారికి పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు.
ప్రతి ఇంచార్జ్ పని తీరుపై రెండు స్రర్వేలు
ప్రతీ ఇన్‌చార్జ్ పనితీరుపై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతీ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు యాక్షన్ ప్లాన్‌ను కమిటీలు ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాకాఫీస్ బృందంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్‌చార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ పనితీరును కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలో తప్పులు సరిదిద్దుకునేలా ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. బూత్ స్థాయి నుంచి ఇంఛార్జి స్థాయి ప్రతీ ఒక్కరి పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన ప్రాధాన్యత ఇచ్చి పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు
పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి భవిష్యత్‌గు భరోసా ఇచ్చే లక్ష్యంతో చంద్రబాబు దీన్ని ప్రారంభించినట్లగా తెలుస్తోంది. పార్టీలో పలు వ్యవస్థలు ఇప్పటికే చరుగ్గా పని చేస్తున్నాయి. అయితే పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం కాబట్టి.. ఈ అంశంపై చంద్రబాబు ఎక్కువగా దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్ మూసివేత
TDP leader Anita: మహానటి రోజాను చూస్తే నవ్వొస్తోంది-టీడీపీ నేత అనిత కౌంటర్
పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీస్- ఆధారాలు సమర్పించాలని ఆదేశం
Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు
AP BJP: చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తు ప్రకటనపై ఏపీ బీజేపీ స్టాండ్ ఏంటి- కోర్ కమిటీలో కీలక నిర్ణయం
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్! టీమ్‌ఇండియాకు నెర్వస్ ఫీలింగ్!
Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!
/body>