Summer Specail Trains : ఉగాది, వేసవి రద్దీ దృష్ట్యా 72 ప్రత్యేక రైళ్లు, ఈ రూట్లలోనే?
Summer Specail Trains : ఉగాది, వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 72 ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. కాకినాడ టౌన్ - లింగపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
Summer Specail Trains : వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ కారణంగా విజయవాడ మీదగా 72 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07295-07296 నెంబర్ గల కాకినాడ టౌన్-లింగంపల్లి స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. ఈ రైలు ఏప్రిల్ 8, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29 తేదీలు, మే నెలలో 2, 4, 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30 తేదీల్లో, జూన్ నెలలలో 1, 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో కాకినాడ టౌన్‌లో బయలుదేరుతుంది.
Two #Ugadi Festival Special Trains between H.S.Nanded – Visakhapatnam @drmsecunderabad @drmhyb @DRMWaltairECoR @drmned @VijayawadaSCR pic.twitter.com/XVzgzCpJN5
— South Central Railway (@SCRailwayIndia) April 1, 2022
కాకినాడ నుంచి
కాకినాడ టౌన్ లో రాత్రి 8.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15కి లింగంపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో, మే నెలలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్ నెలలో 2, 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో లింగంపల్లి నుంచి సాయంత్రం గం.6.25లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం గం.7.10లకి కాకినాడ టౌన్ చేరుతుంది. ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగుడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.
ఉగాదికి స్పెషల్ ట్రైన్
ఉగాది పండగ రద్దీ నేపథ్యంలో 07082-07083 నెంబర్ గల నాందెడ్-విశాఖపట్నం ప్రత్యేక రైలు ఏప్రిల్ 1వ తేదీన నాందెడ్‌లో సాయంత్రం 4.35కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.50కి విశాఖపట్నం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ఏప్రిల్ 3న విశాఖపట్నంలో సాయంత్రం గం.6.20లకి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం గం.3.10లకి నాందెడ్ చేరుకుంటుంది. ఈ రైలు బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.