అన్వేషించండి

Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

Andhra News: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Home Minister Vangalapudi Anitha Strong Warning: రాష్ట్ర ప్రభుత్వంపై అసభ్యకరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ నేతలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ (Ysrcp) కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని అన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే.. చేయండి. మేం ఎదుర్కొంటాం. బాధ్యతగా సమాధానం ఇస్తాం. అంతే కానీ అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని, క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడమేంటి.?. మేమేదో వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వారికి బెయిల్ ఇప్పించేందుకు జగన్ వార్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏంటో జగన్‌కు తెలుసా.?' అంటూ ప్రశ్నించారు.

'ఐదేళ్ల విధ్వంస పాలన'

గత ఐదేళ్ల విధ్వంస పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారు. రాష్ట్రం పరువు తీసే విధంగా పాలన సాగించారు. ఈ 5 నెలల కాలంలో ఏవేవో జరిగిపోయాయంటూ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు జగన్ ఏం చేశారు.?. వైసీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు తీయండి. రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరిగినా ఐదేళ్లపాటు జగన్ మాట్లాడలేదు. మహిళలు అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే అనేక మందిపై కేసులు పెట్టారు. అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారు. డీజీపీ ఆఫీస్ పక్కనున్న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. జగన్ హయాంలో పరదాలు కట్టుకొని సమావేశాలు పెట్టుకున్నారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదు.' అంటూ మండిపడ్డారు.

సోషల్ మీడియా పోస్టులపై..

క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం, పార్టీ ముసుగు ఎందుకని మంత్రి అనిత నిలదీశారు. ఏం జరిగినా మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అత్యాచారాలు జరుగుతున్నాయని లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చీకటి రోజులు అంటే జగన్ తెలుసుకోవాలి. వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి.. విజయమ్మ, షర్మిల, నాపై దారుణమైన పోస్టులు పెట్టాడు. సొంత తల్లి, చెల్లిని వైసీపీ కార్యకర్తలే తిడుతుంటే జగన్‌కు పౌరుషం రాలేదా.? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో.. మా రక్తం మరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. గౌతు శిరీష, చింతకాయల వినయ్, రంగనాయకమ్మను ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. అలాంటి పోస్టులు పెట్టిన వారిని వదిలేయాలంటారా.?. అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం.' అంటూ హెచ్చరించారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget