Happy Birthday Chandrababu: 73వ బర్త్‌డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక సమరమే !
HBD Chandrababu: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సీఎంగా, ప్రతిపక్ష నేతగా జాతీయ రాజకీయాల్లో సైతం పొలిటికల్ హీరోగా ఎదిగిన వ్యక్తి చంద్రబాబు. నేడు ఆయన 73వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
![Happy Birthday Chandrababu: 73వ బర్త్‌డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక సమరమే ! Happy Birthday Chandrababu: TDP Chief Chandrababu key decision on tghe occasion of 73rd Birthday Happy Birthday Chandrababu: 73వ బర్త్‌డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక సమరమే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/a1fcd0e6d220c43f36539bc940866e2e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Happy Birthday Chandrababu: 40 ఇయర్స్ పార్టి... అంతకు మించిన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సీఎంగా, ప్రతిపక్ష నేతగా జాతీయ రాజకీయాల్లో సైతం పొలిటికల్ హీరోగా ఎదిగిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఆయన చూస్తున్న రాజకీయం,చేస్తున్న రాజకీయం కలలో కూడ ఊహించి ఉండరు. రాష్ట్ర విభజన తరవాత 26జిల్లాలు 175 నియోజకవర్గాలకు కుదిరించుకుపోయిన ఎపీ లో తిరిగి సీఎంగా నెగ్గుకు రావాలని ఆయన ప్రయత్నం..కేవలం ప్రయత్నం కాదు. సాక్షాత్తూ అసెంబ్లి సాక్షిగా ఆయన చేసిన సవాల్ తో అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతారా. శపథం చేసినంత ఈజీగా ఆయన మరో సారి ముఖ్యమంత్రి అవుతారా.. కరోనా వ్యాప్తి తరువాత రెగ్యులర్ పాలిటిక్స్‌లో దూసుకెళ్లాలని భావిస్తున్న టీడీపీ బాస్‌కు చంద్రబాబుకు హ్యాపీ బర్త్‌డే..
బర్త్‌డే సందర్భంగా కీలక నిర్ణయం..
నేడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 73వ పుట్టినరోజు (Chandrababu Birthday) సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ప్రజల మధ్య ఉండేలా ప్రతిపక్షనేత భావిస్తున్నారు. మహానాడు తర్వాత 15 రోజులకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నేటి ఉదయం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుకోనున్నారు. సాయంత్రం ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం నెక్కలం గొల్లగూడెంలో చంద్రబాబు గ్రామసభ నిర్వహించనున్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పీడ్‌తో మాజీ సీఎం చంద్రబాబు పోలిటికల్ గా లీడ్ రోల్‌లో ముందుకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పరాజయం తరువాత ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఏపీ అసెంబ్లి వేదికగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అధికార వైఎస్సార్‌సీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తరువాత రాజకీయం ఒక్క సారిగా మారింది. కరోనా పరిస్దితుల నేపథ్యంలో ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు ఇకపై మరింత దూకుడుగా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించటంతో పాటుగా, ప్రజల మధ్య ఎక్కవ సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు.
జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు..
వచ్చే ఎన్నికలకు టీడీపీ కేడర్‌ను సిద్ధం చేసేందుకు ప్రతినెలా రెండు జిల్లాల చొప్పున పర్యటించేందుకు నియోజవర్గాల వారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారని సమాచారం. ఏపీలో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, వాటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా జిల్లాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులను బలోపేతం చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. అన్ని ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ఆయా నియోజకవర్గంలో అసంతృప్తిని పోగొట్టడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. మహానాడు తరువాత ప్రతినెల రెండు జిల్లాల చొప్పున ఏపీ మొత్తం ఏడాదిపాటు పర్యటించేలా అధినేత ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు నేడు పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి.
Also Read: Tammineni Sitaram: గుడ్ మార్నింగ్ ఆమదాలవలస అంటున్న తమ్మినేని సీతారామ్- ప్రచారం మొదలైనట్టేనా!
Also Read: YSRCP: వైఎస్ఆర్‌సీపీలో పదవుల పండగ - జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల పదవులు వీళ్లకే...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)