GVL On AP Special Status : ప్రజలంతా నాకు థాంక్స్ చెప్పాలి - హోదా అజెండా నుంచి తొలగించేలా చేసింది తానేనన్న జీవీఎల్ !
GVL :హోదా అంశాన్ని హోంశాఖ చర్చల అజెండా నుంచి తొలగించేలా చేసింది తానేనని జీవీఎల్ నరిసంహారావు క్లెయిమ్ చేసుకున్నారు. అలా చేసినందుకు ప్రజలు తనకు థాంక్స్ చెప్పాలన్నారు.
ప్రత్యేకహోదా అంశం విషయంలో హోంశాఖ అజెండా నుంచి తొలగించకపోతే ఏపీ దీర్ఘకాలికంగా తీవ్రంగా నష్టపోతుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అందుకే చొరవ తీసుకున్నానని తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేకహోదా విషయంలో తామే మొదటగా స్పందించామని స్పష్టం చేశారు. తన ప్రయత్నంతో హోదా అంశం మరింత సంక్లిష్టం కాకుండా చేయగలిగానన్నారు. తనకు రాష్ట్ర ప్రజలు ధన్యవాదాలు చెప్పాలన్నారు . తాము ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించినప్పుడు వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ నిద్రపోతున్నాయన్నారు. పార్లమెంట్‌లో తాము ఒత్తిడి వల్లే ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశం వచ్చిందని గుర్తు చేశారు.
హోంశాఖ విషయంలో పదిహేడో తేదీన జరగనున్న కమిటీ చర్చల ఎజెండాలో సంబంధం లేని నాలుగు అంశాలు పొరపాటుగా చేర్చారని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశాలను మనమే మాట్లాడుకోవాలన్నారు జీవీఎల్. కమిటీలో వేరే రాష్ట్ర అధికారులు ఉన్నా చర్చ జరగాలి అనటం అవివేకం కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇప్పుడు లేదు. దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖకు షిఫ్ట్ అవుతుందా ? సీఎం జగన్ టాలీవుడ్ పెద్దలతో ఏమన్నారు !
ఏపీ రెవెన్యూ గ్యాప్, స్పెషల్ స్టేటస్ వంటి అంశాలు వివాద పరిష్కార కమిటీలో ఉంచే అంశం పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రాథ్ రెడ్డి స్పందించాలన్నారు. బుగ్గన ఉండాలని చెబితే తన లేఖను మార్చుకుంటానని స్పష్టం చేశఆరు. జూనియర్ స్థాయి అధికారులు పొరపాటు చేశారు. దాన్ని రాజకీయం చేస్తే ఎలా అని జీవీఎల్ వైఎస్ఆర్‌సీపీ నేతలను ప్రశ్నించారు.
ఏపీ కొత్త జిల్లాల్లో పరిపాలన అప్పటినుంచే! మార్చి 18 నాటికి ప్రక్రియ పూర్తి
ఈ అంశంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. కేంద్ర హోం శాఖ సబ్ కమిటీ సమావేశ ఎజెండా నుంచి ప్రత్యేక హోదా వంటి అంశాల తొలగింపు పై స్టేట్ మెంట్ విడుదల చేయాలని కోరారు జీవీఎల్. ఎజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయటానికి మరో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశాలపై స్పందించాలని జీవీఎల్ నరసింహారావు అజయ్ భల్లాను విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకహోదా అంశాన్ని అజెండాలో పెట్టి తొలగించడంపై రాజకీయం జరుగుతూండటంతో ఆయన విజయవాడ వచ్చి మరీ ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయాలన్నీ వెల్లడించారు.