News
News
X

AP New Districts: ఏపీ కొత్త జిల్లాల్లో పరిపాలన అప్పటినుంచే! మార్చి 18 నాటికి ప్రక్రియ పూర్తి

మార్చి 3 వరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ఇతర వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వీటిని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తానికి ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి 3 వరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ఇతర వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వీటిని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మార్చి 4 నుంచి 10 వరకూ కమిటీ అధికారులు జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలను పరిశీలించి.. అనంతరం మార్చి 11 నుంచి 14 వరకు సీఎస్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ కూడా ఈ అభ్యంతరాలను పరిశీలించనుంది. ఆ తర్వాత మార్చి17న తుది నోటిఫికేషన్ జారీ చేసి.. మరుసటి రోజే గెజిట్ నోటిషికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 23 నుంచి 25 వరకూ ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రణాళిక శాఖ కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), అన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటారు. ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలను కలెక్టర్లు సేకరిస్తారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక వెబ్ సైట్ అయిన drp.ap.gov.inలో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఈ విజ్ఞప్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు, సవరణలు ఉంటే ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఒకవేళ, విజ్ఞప్తులు అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తే తిరస్కరించాలని రాష్ట్రస్థాయి కమిటీ సూచిస్తుంది. ఈ కమిటీ చేసిన సిఫార్సులపై అంతిమ నిర్ణయం మాత్రం సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీదే ఉంటుంది.

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 13 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లు ప్రవేశపెడతారు. ఈ జిల్లాల విభజన తర్వాత అన్ని జిల్లాల స్వరూపం మారిపోతోంది. ప్రకాశం జిల్లా పెద్ద జిల్లాగా మారనుంది. విశాఖ చిన్న జిల్లా కానుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 14,322 చదరపు కి.మీ. విస్తీర్ణంతో ప్రకాశం అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కి.మీ. విస్తీర్ణంతో విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా చూస్తే కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంటుంది.

Published at : 14 Feb 2022 11:08 AM (IST) Tags: YS Jagan AP government New districts in AP New districts news AP New Districts list

సంబంధిత కథనాలు

Weather Updates: నేడు తీవ్ర వాయుగుండం - ఏపీకి రెయిన్ అలర్ట్,  తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు IMD

Weather Updates: నేడు తీవ్ర వాయుగుండం - ఏపీకి రెయిన్ అలర్ట్, తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు IMD

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

AP Agri Gold  :   ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

MP Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు

MP Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?