By: ABP Desam | Updated at : 14 Feb 2022 10:55 AM (IST)
ఇటీవల ఏపీ సీఎంను కలిసిన టాలీవుడ్ పెద్దలు (File Photo)
Tollywood Big Heads Meets AP CM YS Jagan: ఒక ప్రక్క సముద్రం, మరోప్రక్క పచ్చని కొండలు.. ! ఓవైపు ప్రకృతి అందాలతో పలకరించే అరకు వ్యాలీ లు.. మరోప్రక్క అధునాతన నిర్మాణాలు.. ! ఇలా ఎటుచూసినా సినిమా షూటింగులకు కావాల్సిన లొకేషన్లు, దేశంలోని వివిధ ప్రాంతాలకు తేలికగా వెళ్లగలిగే రవాణా సౌకర్యాలూ, బస చెయ్యడానికి ఖరీదైన హోటళ్లు.. ఒకటేమిటి ఒక సినిమా షూటింగ్ కు కావాల్సిన అన్ని రకాల వసతులూ విశాఖ లో ఉన్నమాట నిజం. ఇవేవీ లేని రోజుల్లోనే అంటే 70,80 దశకాల్లోనే ఎన్నో సూపర్ హిట్లూ, క్లాసిక్కులుగా నిలిచిపోయిన సినిమాలు విశాఖ పట్నంలో రూపొందాయి.
గత కొన్నేళ్లుగా ఎందుకో వైజాగ్ లో షూటింగ్స్ అంటే మాత్రం టాలీవుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడంలేదు. కొన్ని సినిమాల్లో ఏదో ఒకటి రెండు సన్నివేశాలు మినహా పూర్తిస్థాయి సినిమా షూటింగ్ లు ఇక్కడ జరిగిన సంఘటనలు చాల తక్కువే. ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ లు అయితే హైద్రాబాద్ లేదా విదేశాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దానివల్ల ఏపీకి టాక్స్ రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగు చిత్ర పరిశ్రమని ఏపీకి రావాల్సిందిగా సీఎం జగన్ సినీ పెద్దలను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. వారికి కావాల్సిన వసతులన్నీ వైజాగ్ (Tollywood Shift to Vizag From Hyderabad) లో ఏర్పాటు చేస్తామంటూ సినీ ప్రముఖులకు హామీలు సైతం ఇస్తున్నారు.
విశాఖకు సినిమా నిర్మాణం కొత్త కాదు :
విశాఖకు సినిమాలు షూటింగ్ లు క్రొత్త కాదు. బ్లాక్ వైట్ కాలంలోనే అనేక సూపర్ హిట్ సినిమాల షూటింగ్ లు ఇక్కడే జరిగాయి. ఆల్ టైం లవ్ క్లాసిక్ మరో చరిత్ర, ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు, ఏయన్నార్ బంగారు బాబు, చిరంజీవి అభిలాష, ఛాలెంజ్, జగదేక వీరుడు - అతిలోక సుందరి లాంటి సినిమాలు విశాఖ చుట్టుప్రక్కలే జరిగాయి. ప్రస్తుతం చాలా సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ లూ, సక్సెస్ మీట్ లూ ఇక్కడ జరుగుతున్నా పూర్తి స్థాయి షూటింగ్ ల కోసం మాత్రం స్టూడియోల నిర్మాణం ఇక్కడ జరగడం లేదు.
విశాఖలో 1930ల్లోనే తొలి సినిమా స్టూడియో- సినీటోన్ :
హైదరాబాద్ కంటే ముందే సినీ స్టూడియో నిర్మాణం విశాఖలో. . అదీ స్వాతంత్య్రం కూడా రాకముందే ఇక్కడ సినీ నిర్మాణం జరిగింది. ఆంధ్రా సినీ టోన్ పేరుతో జగన్నాథ రాజు అనే ప్రముఖుడు విశాఖలో స్టూడియో నిర్మాణం చేసారు. రెండు సినిమాలు కూడా నిర్మించారు. అయితే అవి రెండూ నష్టాలు తేవడంతో సినీటోన్ కాలగర్భంలో కలిసి పోయింది. తరువాత వైజాగ్ లో షూటింగ్స్ జరిగినా స్టూడియోల నిర్మాణం మాత్రం జరగలేదు. చాలా కాలం తరువాత వైజాగ్ ప్రాధాన్యత గుర్తించిన ప్రముఖ నిర్మాత రుషికొండ సమీపంలో ఒక స్టూడియోను నిర్మించారు. ఆయనతో పాటు కొంతమంది సినీ నిర్మాతలు కూడా ఇక్కడ స్థలాలు కొని స్టూడియోలు నిర్మిద్దామనుకున్నారు.
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు పెద్దదెబ్బ :
సరిగ్గా అదేసమయంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందడంతో నియో రిచ్ కల్చర్ పెరిగింది. అలా సంపన్నులైన వాళ్లలో ఫైనాన్షియర్లు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల నుండి వెలుగులోనికి వచ్చారు. దానితో సినిమా షూటింగ్ లు ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగానే జరగడం ఎక్కువయ్యాయి. అలాగే గతంలో వైజాగ్ చుట్టుప్రక్కల షూటింగ్లు జరిపిన నిర్మాత, దర్శకుల్లో రామానాయుడు, జంధ్యాల లాంటివారు దివంగతులు కాగా, పోకూరి బాబూ రావు, విశ్వనాధ్, కెయస్ రామారావు, వంశీ లాంటి వారు సినిమా నిర్మాణం తగ్గించారు. దానితో వైజాగ్ లో స్టూడియో నిర్మాణాలు తగ్గిపోయాయి.
ఆదాయం వచ్చేది ఏపీ నుంచే :
నిజానికి సినిమా అభిమానుల పరంగా, జనాభా పరంగా, థియేటర్ల పరంగా ఇలా ఎలా చూసినా తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ నుండే సినిమాలకు కలెక్షన్లు అధికంగా వస్తాయి. కాస్త యావరేజ్ గా పేరుపడిన సినిమాలకు సైతం ఆంధ్ర నుండి వచ్చే కలెక్షన్లు నిర్మాతలకు ఊరట నిచ్చాయి. అలాగే సినిమాలకు పనిచేసే టెక్నీషయన్లు సైతం అధికంగా ఏపీనుండి వెళ్ళినవారే. అయితే వీరి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ట్యాక్సుల రూపంలో తెలంగాణా ప్రభుత్వానికే పోతుండగా, విభజన తర్వాత ఏపీ పరిస్థితి రోజురోజుకీ తీసికట్టుగా మారుతుంది.
ఏపీకి రండి - స్టూడియోలు కట్టండి : సీయం జగన్
ఇవన్నీ గమనించిన ఏపీ ప్రభుత్వం ఎలాగైనా సినీ పరిశ్రమను రాష్ట్రానికి తరలించాలని చూస్తుంది. కనీసం తెలంగాణ లోలానే ఇక్కడ కూడా స్టూడియోలు కట్టాలని వారిని కోరుతుంది. సినిమా వారికి కావాల్సిన ఇళ్ల స్థలాలు, స్టూడియోలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని ఊరిస్తోంది. దీనివల్ల ఇక్కడి జనాలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఏపీకి ఆదాయం లభిస్తుంది అనేది ప్రభుత్వ ఆలోచన. మరి ఆ ఆలోచనకు సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Union Minister in AP: ఒకే రోజు ఏపీలో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన! అందుకోసమేనా?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
Visakha Vandanam: విజయదశమికే విశాఖ నుంచి పాలన, స్వాగత ఏర్పాట్లు చేయనున్న నాన్ పొలిటికల్ జేఏసీ
IND Vs AUS: వార్ వన్‌సైడ్ - రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 99 పరుగులతో భారత్ విజయం!
Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్
Upcoming Electric SUVs: త్వరలో మనదేశంలో రానున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే - లిస్ట్‌లో ఏ కార్లు ఉన్నాయి?
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
/body>