Guntur Ramya News: రమ్య కుటుంబ సభ్యులను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం... ఘటనపై వివరాలు సేకరణ!
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం గుంటూరులో పర్యటించింది. బాధిత కుటుంబ సభ్యులను కలిశారు.
![Guntur Ramya News: రమ్య కుటుంబ సభ్యులను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం... ఘటనపై వివరాలు సేకరణ! Guntur Ramya News National SC commission team meets b.tech student ramya family members Guntur Ramya News: రమ్య కుటుంబ సభ్యులను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం... ఘటనపై వివరాలు సేకరణ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/caff3879555cd2eaf3b2b90ab0f51163_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం ఇవాళ గుంటూరులో పర్యటించింది. ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ హల్దార్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి రమ్య కుటుంబ సభ్యులను కలిశారు. రమ్య చిత్రపటానికి కమిషన్ బృందం పూలమాల వేసి నివాళులు అర్పించారు. కమిషన్ సభ్యులు రమ్య కుటుంబాన్ని కలిసి సందర్భంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ కమిషన్ బృందంతో బీజేపీ మహిళ నేతలు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
టీడీపీ ఫిర్యాదు
రమ్య హత్య ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు గుంటూరు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను టీడీపీ బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్ కమిషన్ సభ్యులను విజయవాడలో కలిశారు. రమ్య హత్య ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను ఎస్సీ కమిషన్ బృందానికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్ టీడీపీ నేతలకు హామీఇచ్చింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది.
Also Read: Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు
అసలేం జరిగింది
గుంటూరులోని కాకాణి రోడ్డులో బీటెక్ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. గుంటూరు పరమయ్యగుంట సెంటర్ వద్ద ఆదివారం(ఆగస్టు 15) ఉదయం ఈ దారుణం జరిగింది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతని స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి ఏపీ సీఎం జగన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. నిందితుడికి కఠినంగా శిక్షలు పడేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తర్వాత బాధిత కుటుంబ సభ్యులను టీడీపీ నేత లోకేశ్ పరామర్శించారు. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఉద్రిక్తతలో లోకేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. రాజకీయపరంగా అధికార, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)