అన్వేషించండి

Pawan Kalyan: ఏపీకి వైసీపీ హానికరం... లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేస్తారా.... ఉక్కు దీక్షలో పవన్

అప్పుంటే అమ్మేస్తాం అనే వాదన సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. అలా అయితే ఏపీకి రూ.లక్షల కోట్ల అప్పులున్నాయి కదా ప్రైవేటీకరణ చేస్తారా అని పవన్ ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటానికి సంఘీభావంగా చేపట్టిన దీక్ష ముగిసింది. సుమారు 7 గంటలపాటు పవన్ దీక్ష చేశారు. దీక్ష అనంతరం మాట్లాడిన పవన్.. వైసీపీ నేతలు జనసేన పార్టీకి శత్రువులు కాదన్నారు. వైసీపీ విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఒక్క ఎమ్మెల్యే లేని తాను కేంద్రంతో మాట్లాడుతుంటే... అధికారంలో ఉన్న వైసీపీ సమస్యను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. తప్పు కేంద్రం వద్ద మాత్రమే లేదని, రాష్ట్ర ప్రభుత్వ తీరులో కూడా ఉందని ఆరోపించారు. రాష్ట్రం బాధ్యత తీసుకోకపోతే కేంద్రం ఎలా పట్టించుకుందని ప్రశ్నించారు. ఏదైనా సమస్య గురించి మాట్లాడితే వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని పవన్ అన్నారు. 

Also Read:  ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడం

జనసేనకు ఓట్లు వేయకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడతున్నామని పవన్ అన్నారు. 2014లో ఓట్లు చీల్చే ఉద్దేశం లేక పోటీ చేయలేదన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదని పవన్ అన్నారు.  2024 ఎన్నికల తరువాత వైసీపీ అడుగుతున్న ప్రతీ ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ఉంటే మంగళగిరిలో దీక్ష ఏంటని ఎద్దేవా చేస్తున్నారన్న పవన్... వైసీపీ అధిష్టానానికి కార్మికుల పోరాటం తెలియజేయాలని ఇక్కడ దీక్ష పెట్టామన్నారు. 

Also Read:  చంద్రబాబు చూడాల్సింది అఖండ మూవీ కాదు జస్టిస్ చంద్రు వీడియో... ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడే హోదా కనుమరుగు

వైసీపీ నేతలు పాదయాత్ర చేస్తే మద్దతిస్తాం 

'స్టీల్ ప్లాంట్ కు రూ.22 వేల కోట్ల అప్పు ఉంటే ప్రైవేటీకరణ చేస్తాయంటున్నారు. ఏపీ ప్రభుత్వానికి రూ. ఆరు లక్షల కోట్ల అప్పు ఉంది కదా ఏపీని ప్రైవేటీకరణ చేస్తారా ? ఇది చేయనప్పుడు అది ఎందుకు చేస్తారు' అని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారం కోసం పాదయాత్రలు చేసిన వైసీపీ నేతలు... ఇప్పుడెందుకు పాదయాత్ర చేయడంలేనది పవన్ ప్రశ్నించారు. అలా వస్తే వైసీపీకి మద్దతిస్తానని పవన్ అన్నారు.  అమరావతి రాజధానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు. 

జై అమరావతితో పాటు జై ఆంధ్ర

అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్లాలంటే జై అమరావతితో పాటు జై ఆంధ్ర అనాలని పవన్ పిలుపునిచ్చారు. రూ.700 మద్యం అమ్ముతున్న ప్రభుత్వం సినిమా టికెట్లను రూ.5 లకు అమ్ముతుందని ఎద్దేవా చేశారు. ఏపీలో తన సినిమాలను ఆపేస్తాం అని బెదిరిస్తున్నారన్న పవన్... ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తానని అన్నారు. చట్టసభల్లో బూతులే శాసనాలుగా మారాయని పవన్ అన్నారు. సీఎంగా చేసిన వ్యక్తి సతీమణిని అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. 

Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget