అన్వేషించండి

Gummanuru Jayaram: గుంతకల్లులో చంద్రబాబు వ్యూహం ఏంటి? టికెట్ ఆయనకే ఎందుకిచ్చారు?

AP Elections News: చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

AP Elections 2024: ఆ నియోజకవర్గంలో ఆ నేతకు టికెట్ ఇస్తే సహకరించే పరిస్థితి లేదన్నారు. పక్క జిల్లా నుంచి వచ్చి పార్టీలో చేరితే టికెట్ ఎలా ఇస్తారు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైనే ప్రత్యక్షంగా విమర్శలు కూడా గుప్పించారు. అవన్నీ లెక్కచేయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆ నేత పార్టీలోకి చేరగాని గుంతకల్లు అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. ఇంతకు ఆ నేత ఎవరు ఆ నేతపైన చంద్రబాబు నాయుడుకి అంత నమ్మకం ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. పార్టీ నేతలు సీనియర్లు ఎంత చెప్పినా వినకుండా గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెవులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిని సారించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం.. ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ పార్టీలో ఇమడలేక కొన్ని అనివార్య కారణాలతో ఆ పార్టీని విడాల్సి వచ్చింది. దీంతో గుమ్మనూరు జయరాం ఏ పార్టీలోకి వెళ్తారు అని పెద్ద చర్చని కొనసాగింది. అనుకోకుండా గుమ్మనూరు జయరాం టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.  పార్టీలోకి చేరిన వెంటనే అధినేత చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఏకంగా గుంతకల్లు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. 

 వాల్మీకి (బీసీ) నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గుమ్మనూరు జయరాం

వాల్మీకి (బీసీ) సామాజిక వర్గంలో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేతగా గుమ్మనూరు జయరాంకు పేరుంది.  ఆలూరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పిఆర్పి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 

 వ్యతిరేకులను, అసంతృప్తులను ఏకతాటిపైకి తెచ్చుకున్న జయరాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంతకల్లు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అవేమీ లెక్క చేయని గుమ్మనూరు జయరాం ఎన్నికలు నాటికి అందర్నీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గంలోని వ్యతిరేకులను,అసంతృప్తులను ఏకం చేసేందుకు జయరాం సోదరుడు నారాయణస్వామి, కుమారుడు ఈశ్వర్ రంగంలోకి దిగారు. మండలాల వారీగా నాయకులతో కలుస్తూ వ్యతిరేకులను అసంతృప్తులను కలిసి పార్టీకి పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో తెలియజేస్తూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చి గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. 

 పట్టు వీడిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్

ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉండడంతో గుంతకల్లు నియోజకవర్గంలోని అసంతృప్తులను ఏకం చేసేందుకు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రంగంలోకి దింపి జితేంద్ర గౌడ్ ను పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబు నాయుడు జితేంద్ర గౌడ్ కి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. స్వయంగా అధినేత హామీ ఇవ్వడంతో శాంతిచ్చిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్  గుమ్మనూరు జయరాంకు సహకరించలని నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ కు పిలుపునిచ్చారు. పార్టీలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మన అధినేత చంద్రబాబునాయుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా పలు సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ప్రసంగించారు. 

 విజయ అవకాశాలు ఎక్కువే 

గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా వాల్మీకి (బీసీ) ఓటర్లు అధికంగా ఉండడంతో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినట్లు జోరుగా చర్చ సాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా గుంతకల్లు,రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గం లో కూడా బీసీ ఓటర్లు అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి వైసీపీ తరఫున బరిలో నిలుస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget