అన్వేషించండి

Ganta Comments : టీడీపీ గెలుపునకు పవన్ ఇచ్చిన పిలుపు కూడా కారణమేనంటున్న గంటా - ఎలా అంటే ?

టీడీపీ గెలుపునకు పవన్ ఇచ్చిన పిలుపు కూడా కారణమేనని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అంటున్నారు. ఎలా కారణమో కూడా ఆయన వివరించారు.

 

Ganta Comments :   ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ కోరుకున్నట్లుగానే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చిందని  గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది అని.. 2024లో టీడీపీదే విజయని ధీమావ్యక్తం చేశారు. ఫలితాల సందర్భంగా  విశాఖలో మీడియాతో మాట్లాడారు.                                    
 
గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని  అంటున్నారు.   ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను విజయపథాన నిలిపిన గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎక్కడా డబ్బులు, కానుకలు పంచలేదని .... ఆరునెలల ముందే అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.  తమ అభ్యర్థిని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించామని అన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి చెంపపెట్టని గంటా అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు.                                 

పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించలేదు. కానీ వైసీపీకి మాత్రం ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. పొత్తులో ఉన్న బీజేపీకి కూడా ఓటు వేయమనలేదు. దీంతో  పవన్ ఉద్దేశం తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించమనే అని.. జససైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారికి తగ్గట్లుగానే గంటా వ్యాఖ్యలు చేశారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి  ఫలితాలు రావాలంటే..జనసేనతో పొత్తు ఉంటే మంచిదని గంటా కూడా అనుకుంటున్నారు. అందుకే  జనసేనకు క్రెడిట్ ఇచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా  ప్రచారం కూడా చేశారు. 

గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత గంటా శ్రీనివాసరావు వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ మారుతారన్న ప్రచారం చాలా కాలం సాగింది. చివరికి వైఎస్ఆర్‌సీపీలోనూ చేరుతారని చెప్పుకున్నారు. కానీ ఈ పార్టీ మార్పు ప్రచారాలపై ఆయన ఎప్పుడూ స్పందించలేదు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ స్పీకర్ ఆమోదించలేదు. ఇప్పటికీ ఆ లేఖ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం గంటా శ్రీనివాసరావు హాజరు కావడం లేదు.                               
                      

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget