TDP Pattabhiram : గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చిన పోలీసులు, వాచిపోయిన చేతులు చూపిస్తూ కోర్టుకు!
TDP Pattabhiram : టీడీపీ నేత పట్టాభిని గన్నవరం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ వాచిపోయిన చేతులు చూపించారు పట్టాభి.
![TDP Pattabhiram : గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చిన పోలీసులు, వాచిపోయిన చేతులు చూపిస్తూ కోర్టుకు! Gannavaram police produced Tdp leader Pattabhiram tdp leaders alleged police beaten Pattabhi DNN TDP Pattabhiram : గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చిన పోలీసులు, వాచిపోయిన చేతులు చూపిస్తూ కోర్టుకు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/21/985b62b34ca3f44c400e58d9512612c31676982346341235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP Pattabhiram : గన్నవరం ఘర్షణలో అరెస్టు అయిన టీడీపీ నేతలు పట్టాభిరామ్, దొంతు చిన్నా, గురుమూర్తిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గన్నవరం కోర్టుకు వెళ్తూ వాచిపోయిన చేతులను చూపించారు టీడీపీ పట్టాభిరామ్. కోర్టుకు హాజరవుతున్న సమయంలో టీడీపీ నేత పట్టాభి తనని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో చూడండని మీడియాకు తన చేతిగాయలు చూపించారు. నా భర్తను బాగా హింసించారని పట్టాభి భార్య చందన ఆరోపించారు. పోలీసుల సహకారంతోనే ఇదంతా జరిగిందన్నారు. తోట్ల వల్లూరు పీఎస్‍లో నా భర్తను ముసుగేసి ముగ్గురు కొట్టారని, ఆయనకు ప్రాణహాని ఉందని మొదటి నుంచి చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని చందన ఆగ్రహం వ్యక్తంచేశారు. నా భర్త ఇంత ఆందోళనతో ఎప్పుడూ కనిపించలేదన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకుని గన్నవరం వెళ్ళిన పట్టాభిరామ్ ను తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు అక్రమ కేసుల్లో ఇరికించి, పోలీసుల కస్టడీలో కొట్టి, హింసించారు. ఏపీలో పూర్తిగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. pic.twitter.com/apqajTFkOr
— Telugu Desam Party (@JaiTDP) February 21, 2023
నా భర్తను చిత్తహింసలు పెట్టారు- పట్టాభి భార్య
టీడీపీ నేతలు పట్టాభిరామ్, దొంతు చిన్నా, గురుమూర్తిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరపర్చారు. గన్నవరం బయలుదేరిన పట్టాభిని పోలీసులు మార్గమధ్యలో అరెస్టు చేశారు. సోమవారం నుంచి పట్టాభి ఆచూకీ తెలియకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని పట్టాభి భార్య చందన ఆందోళన దిగారు. ఈ పరిణామాల మధ్య గన్నవరం కోర్టులో పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభిని చిత్రహింసలు పెట్టారని ఆయన సతీమణి చందన ఆరోపించారు.
పట్టాభి అరెస్ట్
గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టాభిరామ్ గన్నవరం బయలుదేరారు. మార్గమధ్యలో పట్టాభిని పోలీసులు అరెస్టుచేశారు. ఆ సమయంలోనే వైసీపీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. పట్టాభి కారును ధ్వంసం చేశారు. అనంతరం ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు.
పట్టాభిని చిత్రహింసలు పెట్టారు
సోమవారం సాయంత్రం సాయంత్రం నుంచి కొమ్మారెడ్డి పట్టాభిని కొడుతూ వివిధ పోలీస్‌స్టేషన్లకు తిప్పారని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టి ముక్కల రఘురామరాజు ఆరోపించారు. చివరిగా తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడ కరెంటు తీసేశారని, ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకుని పట్టాభిని తీవ్రంగా హింసించారని రఘురామరాజు అన్నారు. పట్టాభి ముఖానికి కూడా ముసుగువేసి చిత్రహింసలు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నవరం ఘటనలో 6 ఎఫ్ఐఆర్ లు
గన్నవరం ఘటనలో పోలీసులు 6 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. గన్నవరం సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ఏ1గా పట్టాభిని, ఏ2గా దొంతు చిన్నా, మరో 15 మందిపై కేసులు పెట్టారు. వీరిని కోర్టులో హాజరుపర్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)