Srikakulam Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించారు ఏఆర్ కానిస్టేబుళ్లు. అనంతరం బొలెరో వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. వస్తుండగా సుమ్మాదేవి దగ్గర జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా... వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది.
ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు కె.కృష్ణుడు (ఏఆర్ ఎస్సై ), వై. బాబూరావు (హెచ్సీ), పి. ఆంటోనీ (హెచ్సీ), పి. జనార్దనరావు (డ్రైవర్) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సీఎం జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో పోలీసులు మృతి చెందడంపై మృతి చెందిన పోలీసులు మృతి చెందటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పోలీసుల మృతి ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటని డీజీపీ సవాంగ్ తెలిపారు. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుందన్నారు.
Also Read:Hyderabad Murder: చార్మినార్ మధుసూధన్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు విషయం తేల్చేసిన పోలీసులు