News
News
వీడియోలు ఆటలు
X

Kiran In Delhi : బీజేపీ పెద్దలతో కిరణ్ వరుస భేటీలు -ఫస్ట్ టార్గెట్ కర్ణాటకనా ?

బీజేపీ అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. అమిత్ షాతో అరగంట పాటు చర్చలు జరిపారు.

FOLLOW US: 
Share:

Kiran In Delhi :  భారతీయ జనతా పార్టీలో చేరిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి వరుసగా ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు.  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన శుక్రవారం సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. శనివారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. దాదాపుగా  40 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపైనాచర్చించారు.  మరో సీనియర్ నేత బీఎల్ సంతోష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.               

కిరణ్ కుమార్ రెడ్డి అనుభవాన్ని ముందుగా కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఇరవై నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి  ముందుగా కర్ణాటక ఎన్నికల్లో ఓ ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన చేస్తున్నట్లగా చెబుతున్నారు. కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో ఆయన నేరుగా ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు కానీ.. ఆయన ఆలోచనలను ఎన్నికల్లో వాడుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.                     

మరో వైపు ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి కిరణ్ కుమార్ రెడ్డిని పంపకపోచ్చని.. ఆయనను పార్టీలో చేర్చుకున్న వ్యూహం జాతీయ రాజకీయాలని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఆయనకో పదవి ఇస్తుందని..  జాతీయంగా పార్టీ కోసం పని చేస్తారని.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం  చేసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పని చేసినందున తెలంగాణలో రాజకీయాలపైనా ఆయనకు అవగాహన ఉంటుంది. సమైక్యాంధ్ర పార్టీ పెట్టినందన ఆయన జోక్యం నేరుగా తెలంగాణలో ఉండకపోవచ్చు కానీ.. ఢిల్లీలో ఉంటూ తెలంగాణ పై రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కిరణ్ రెడ్డి వ్యూహాత్మకంగా పని చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.                               

కిరణ్ కుమార్ రెడ్డి చేరిక కోసం ఢిల్లీ వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఏపీ బీజేపీ నేతలు లేరు. సోము వీర్రాజు సహా కీలక నేతలంతా ఏపీలోనే ఉన్నారు. అయితే వారెవరూ కిరణ్ రెడ్డి చేరికపై వ్యతిరేకత వ్యక్తం  చేయడంలేదు. అందరూ స్వాగతించారు. కలిసి పని చేస్తామన్నారు. అలాంటప్పుడు.. బీజేపీ నేతలంతా కిరణ్ రెడ్డి చేరిక కార్యక్రమలో పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం.. కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ రాజకీయాల కోణంలోనే హైకమాండ్ చేర్చుకుందని అందుకే చేరిక విషయంలో రాష్ట్ర నేతలతో పెద్దగా సంప్రదింపులు జరపలేదని.. సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. 

Published at : 08 Apr 2023 04:31 PM (IST) Tags: BJP Amit Shah AP BJP Kiran Kumar Reddy

సంబంధిత కథనాలు

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ