By: ABP Desam | Published : 02 Sep 2021 07:17 PM (IST)|Updated : 02 Sep 2021 07:18 PM (IST)
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన భార్యపై సీబీఐ అధికారులు కొత్తగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టి వేసింది. సీబీఐ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా హైకోర్టుపై సానుకూలతే వచ్చింది. అయితే కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం ఏమిటనిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మళ్లీ ప్రాథమిక విచారణ జరిపి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Also Read : బీజేపీ -జనసేన దగ్గరగా ఉన్నాయా..? దూరంగా ఉన్నాయా..?
ఆదిమూలపు సురేష్, ఆయన భార్య ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఉద్యోగులు. సర్వీస్ వదిలేసి ఆదిమూలపు సురేష్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన భార్య ఇప్పటికీ ఐఆర్ఎస్ ఉద్యోగిగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఐఆర్ఎస్ అధికారులపై సీబీఐ 2016లో దాడులు చేసింది. సోదాల్లో ఆదాయానికి మించి రూ. కోటి ఉన్నట్లు గుర్తించింది. ఆదాయానికి మించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సిబిఐ ప్రకటించింది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కలిగివున్నారని సీబీఐ పేర్కొంది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కలిగివున్నారని సీబీఐ పేర్కొంది. ఈ 2017లో సురేశ్, ఆయన భార్య విజయలక్ష్మిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో విజయలక్ష్మిని ఏ1గా, సురేశ్ ను ఏ2గా పేర్కొన్నారు.
Also Read : రకుల్ ఈడీ ముందు హాజరు కాకపోతే ఏం చేస్తారు..?
నేరం విజయలక్ష్మి చేసినా ఆ దిశగా ప్రోత్సహించింది సురేషేనని సీబీఐ చెప్పింది. అయితే ప్రాథమిక దర్యాప్తు లేకుండానే కేసు నమోదు చేశారని మంత్రి సురేశ్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో పిటిషన్ ను ఇవాళ విచారించిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన ధర్మాసనం.. సివిల్ సర్వీసు అధికారులపై కేసు నమోదు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
Also Read : ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష
అయితే ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు అనంతరమే ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారని సీబీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.అయితే ఆ విషయం అఫిడవిట్ లో ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మళ్లీ ప్రాథమిక దర్యాప్తు జరిపి తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో హైకోర్టులో సాంకేతిక కారణాలతో కేసును కొట్టి వేయించుకోగలిగిన సురేష్ దంపతులకు మళ్లీ కేసును ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత విచారణ ప్రారంభమవుతుంది.
Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, ఖరారు చేసిన సీఎం జగన్? ఈయనకి మళ్లీ ఛాన్స్
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా
Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి