అన్వేషించండి

YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం

YSRCPLP meeting: అసెంబ్లీకి వెళ్లకూడదని.. మండలికి మాత్రం వెళ్లాలని జగన్ నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు.

YSRCPLP meeting:  అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, ప్రతిపక్ష గొంతు నొక్కేలా అధికార కూటమి వ్యవహరిస్తోందన్న కారణంగా అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయించారు.  ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వరని, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదని జగన్  అభిప్రాయపడ్డారు. ప్రజా క్షేత్రంలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అందుకే అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ తన ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.    

శాసనమండలికి హాజరు కానున్న వైసీపీ ఎమ్మెల్సీలు                 
 
అసెంబ్లీకి జగన్ సహా ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి  విషయంలో మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు. మండలిలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ తమ గళాన్ని వినిపించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా మండలి సమావేశాలకు హాజరై, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, బిల్లులపై లోతుగా చర్చించాలని జగన్ ఆదేశించారు.               

నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు                                        
 
అసెంబ్లీకి వెళ్లని సమయంలో ఎమ్మెల్యేలు ఖాళీగా ఉండకుండా, నియోజకవర్గాల్లో పర్యటించాలని జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాల వైఫల్యాలు, పెరిగిన ధరలు, శాంతి భద్రతల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరచాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న అప్రజాస్వామిక పరిణామాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రాకపోవడం వల్ల ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని అధికార పక్షం విమర్శిస్తోంది. అయితే, గౌరవం లేని చోట ఉండి ప్రయోజనం లేదని జగన్ వర్గం వాదిస్తోంది.             

స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదన్న అప్పిరెడ్డి                      

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఎమ్మెల్సీ  లేళ్ల అప్పిరెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు.  అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న అధికార కూటమి ధోరణికి నిరసనగా తాము శాసనసభను బహిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే కనీస అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
 శాసనసభను బహిష్కరించినప్పటికీ, శాసనమండలి  సమావేశాలకు తాము తప్పకుండా హాజరవుతామని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. మండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఉన్నందున, అక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, ప్రజా సమస్యలపై నిలదీస్తామని చెప్పారు. అసెంబ్లీకి వెళ్లని సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారని, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.  సూపర్ సిక్స్  పథకాల అమలులో వైఫల్యం, శాంతిభద్రతల క్షీణతపై ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
 స్పీకర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని అప్పిరెడ్డి విమర్శించారు.  

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget