Vizag Rain Alert: విశాఖ ప్రజలకు అలర్ట్ - మీరు ఊహించనంత వర్షం కురవబోతోంది - ఈ జాగ్రత్తలు తీసుకోండి !
AP Extremely heavy rains: విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారవర్గాలు సూచిస్తున్నాయి.

Extremely heavy rains are expected in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పర్వతీపురం-మన్యం, ఎస్.కోట వంటి అంతర్గత ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇదే సమయంలో, విశాఖపట్నం మరో దఫా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) సూచనల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు తీరంలో ఈ వర్షాలు కొనసాగుతాయి. విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి. నగరవాసులు ఇంటిలోనే ఉండాలని ..అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
Get ready Vizaguu 🔥
— Andhra Pradesh Weatherman (@praneethweather) September 26, 2025
Nothing can #Visakhapatnam city from getting HEAVY RAINS today. Perfect alignment of Intense rain bands along East Coast pushing into the city. Next 3 hours, rounds of rains are expected. Requesting Vizagites to stay indoors or go out with umbrella. I will…
విజయనగరం జిల్లాలో గత 24 గంటల్లో 80-100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఎస్.కోట, గజపతినగరం, పర్వతీపురం-మన్యం వంటి ప్రాంతాలకు విస్తరించింది. విశాఖపట్నం నగరంలో సముద్రం అల్లకల్లోలంగామారింది. తీరం వెంబడి ఆవరించిన మేఘాల వల్ల నగరంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు (40-50 కి.మీ./గం.) ఉండే అవకాశం ఉంది. గత 24 గంటల్లో నగరంలో 60 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది .
#VizagRains Update ⚠️ : Vizianagaram getting beast spell of rains and the rains will push into Interiors areas like S.Kota. Meanwhile once again sea is getting super active for another round of HEAVY RAINS across entire Vizag city. Next 1 hour, good rains ahead for Vizag ⚠️⚠️
— Andhra Pradesh Weatherman (@praneethweather) September 26, 2025
అల్పపీడనం కారణంగా ఉత్తర ఆంధ్ర లో సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, ఇతర ప్రాంతాలకు యెల్లో హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, విజయనగరం నివాసులు ఇంటిలోనే ఉండాలని అత్యవసరంఅయితే తప్ప బయటకు రావొద్దని సలహాలిస్తున్నారు. అత్యవసర సేవల కోసం 100 (పోలీస్), 108 (అంబులెన్స్), 1070 (విపత్తు నిర్వహణ) నంబర్లను సంప్రదించవచ్చు. వర్షాలు అక్టోబర్ 2 వరకు కొనసాగే అవకాశం ఉన్నందున, స్థానిక యంత్రాంగం నిరంతరం వాతావరణ సమాచారాన్ని అందజేస్తుంది.





















