Dil Raju Vs Satyanarayana: అత్తి సత్యనారాయణ సంచలన ఆరోపణలు - అసలు ధియేటర్ల మూసివేత కుట్ర దిల్ రాజు సోదరుడిదే !
Theaters Issue: ధియేటర్ల మూసివేత కుట్ర దిల్ రాజు సోదరుడితేనని బహిష్కృత జనసేన నేత అత్తి సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన దిల్ రాజు సోదరుడిపై కోర్టుకెళ్తానన్నారు.

Expelled Jana Sena leader Athi Satyanarayana: ధియేటర్ల మూసివేత ప్రతిపాదన తనది కాదని జనసేన, ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ స్పష్టం చేశారు. దిల్ రాజు ఉద్దేశపూర్వకంగానే తన పేరు ప్రస్తావించారని ఆయన ఆరోపించారు. దిల్ రాజు పై కోర్టుకు వెళ్తాననని ప్రకటించారు. నా రాజకీయ భవిష్యత్ పై దెబ్బ కొట్టారని విమర్శించారు. ఆ నలుగురు దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునిల్ నారంగ్ .. అని ఈ నలుగురే బంద్ కుట్ర వెనుక ఉన్నారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వారి తొక్క తోలు తీసేస్తారన్నారు.
తన ప్రాణం ఉన్నంత వరకూ పవన్ కళ్యాణ్ తోనే ఉంటాననని.. దిల్ రాజు ను ఇప్పుడు కమల్ హాసన్ అంటున్నారని మండిపడ్డారు. నా పార్టీ నాకు అగ్ని పరీక్ష పెట్టింది ఇది దిల్ రాజు కుట్రని పార్టీకి వివరిస్తాననని అన్నారు. రాజమండ్రి జనసైనికులు తనకు ఏర్పడిన పరిస్థితి చూసి బాధపడుతున్నారని అత్తి సత్యనారాయణ అన్నారు. ఇది సినిమాకు సంబంధించిన వ్యవహారం కాబట్టి జనసేన పార్టీ నన్ను అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. దిల్ రాజు సోదరుడ్ని కాపాడేందుకు తనను బలి చేశారని అత్తి సత్యనారాణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అత్తి సత్యనారాయణ ఎగ్జిబిటర్ . డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. 'అను శ్రీ ఫిల్మ్స్' పేరుతో సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా అత్తి సత్యనారాయణకు పేరుంది. ఆయనకు ఇరవైకి పైగా సినిమా ధియేటర్లు ఉన్నాయి. తెలుగు సినీ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో ఆయన ధియేటర్ల బంద్ ప్రతిపాదన పెట్టారని దిల్ రాజు ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సింగిల్స్ స్క్రీన్స్ ఎక్కువ. ఏపీలో దాదాపు వెయ్యి సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఉంటే, అందులో ఉభయ గోదావరి జిల్లాల్లో 50 నుంచి 60 వరకు థియేటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. టికెట్ల ధరల నియంత్రణ, థియేటర్ల అద్దె విధానం కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని కొంత కాలంగా డిమండ్ చేస్తున్నారు
కొత్త సినిమాలను ఓటీటీలలో కొంత ఆలస్యంగా విడుదల చేయాలని లేకపోతే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ డిమాండ్ మొదలై సినిమా హాళ్ల బంద్ వరకు వెళ్లింది. సినిమా రంగానికి సంబంధించి కూడా ఉభయ గోదావరి జిల్లాల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలా థియేటర్ల బంద్ సమస్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చివరకు ఈ పిలుపుకు వెనుక ఉన్నారన్న కారణంతో జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణపై వేటు పడింది. కానీ అసలు కుట్ర అంతా దిల్ రాజుదేనని అత్తి సత్యనారాయణ చెబుతున్నారు.





















