By: ABP Desam | Updated at : 13 Jan 2022 09:00 PM (IST)
పీఆర్సీ జీవో రిలీజ్ చేయవద్దంటు్న్న ఉద్యోగసంఘాలు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించగానే చప్పట్లు కొట్టారు కానీ ఇప్పుడు ఆ పీఆర్సీతో జీవో జారీ చేయవద్దని ప్రభుత్వ పెద్దల్ని బతిమాలుతున్నారు. జీవో జారీ చేస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణంగా ఫిట్‌మెంట్ తగ్గించినా ఒప్పుకున్నారు కానీ.. హెచ్‌ఆర్‌ఏ మాత్రం తగ్గించవద్దని కోరుతూండటమే. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని సిఫార్సు చేసింది. వాటినే అమలు చేస్తామని ప్రభుత్వం అంటోంది. ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించాలని ఉద్యోగ సంఘ నేతలు కోరుతున్నారు.
రెండు, మూడు రోజుల నుంచి ఉద్యోగ సంఘ నేతలు అదే పనిగా ఉన్నతాధికారులను కలుస్తున్నారు. కానీ ఎలాంటి పురోగతి లేదు. గురువారం కూడా దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై సీఎంఓ అధికారులతో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు చర్చించారు. అయినా ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఎస్ఏ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అంశంపై బుధవారం రాత్రి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు గురువారం ఉదయమే పీఎంవో లో ప్రత్యక్షమయ్యారు.
Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !
ఫిట్మెంట్పై ఉద్యోగులంతా అసంతృప్తిగా ఉన్న వేళ.. గత ప్రభుత్వం కల్పించిన రాయితీల్లో కోతలు వేయడం సరికాదని ఉద్యోగ సంఘం నేతలు అంటున్నారు. సంక్రాంతి ముగిసే వరకు హెచ్ఆర్‌ఏ సహా ఇతర అంశాలకు సంబంధించిన జీవోలు విడుదల చేయబోమని సీఎంవో అధికారులు హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హెచ్ఆర్‌ఏ స్లాబులను కేంద్ర ప్రభుత్వ స్లాబులతో పోల్చడం వల్ల సచివాలయ హెచ్వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులు దాదాపు 12 శాతం మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5శాతం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 4.5శాతం హెచ్ఎస్ఏ కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
హెచ్ఆర్ఏ తగ్గించొద్దని మరో మారు కోరినట్టు చెప్పారు. సీఎంతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారని వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా ఉద్యోగుల కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. జీతాలు పెంచకపోయినా పర్వాలేదు.. తగ్గించకపోతే చాలని ఉద్యోగులు ఇప్పుడు బతిమాలుకుంటున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్గా కిరణ్కుమార్ రెడ్డి ! కాంగ్రెస్కు జరిగే మేలెంత ?
Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
LPG Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు
Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!