అన్వేషించండి

Raj Mantena TTD: టీటీడీకి రాజ్ మంతెన 9 కోట్ల విరాళం - గతంలోనూ 16 కోట్లు ఇచ్చిన దాత - ఎవరీ రాజ్ మంతెన ?

Raj Mantena: అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మంతెన రామలింగ రాజు రూ.9 కోట్ల భారీ విరాళం టీటీడీకి ఇచ్చారు. భక్తుల వసతి సౌకర్యాలను మెరుగుపర్చడానికి వీటిని ఖర్చు చేస్తారు.

Donor Raj Mantena donates Rs 9 crore to TTD:  తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు  మెరుగుపరిచేందుకు   తిరుమల తిరుపతి దేవస్థానం కి మరో గొప్ప విరాళం అందింది. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు  వ్యాపారవేత్త, శ్రీవారి భక్తుడు  మంతెన రామలింగ రాజు మంగళవారం రూ.9 కోట్ల విరాళం అందజేశారు. ఈ మొత్తం తిరుమలలోని పీఏసీ 1, పీఏసీ 2, పీఏసీ 3  భవనాల పూర్తి అధునీకరణకు ఉపయోగించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు  మంతెన రామలింగ రాజు ఈ విరాళం డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు. 

ఇది  మంతెన రామలింగ రాజు మొదటి విరాళం కాదు. 2012లోనే ఆయన టీటీడీకి రూ.16 కోట్ల భారీ విరాళం అందజేశారు.  తిరుమలలోని  పద్మావతి రెస్ట్ హౌస్ నిర్మాణానికి విరాళమిచ్చారు.  ఆ సమయంలోనూ భక్తుల సౌకర్యార్థమే ఈ విరాళం అందించినట్లు ఆయన తెలిపారు. పీఏసీ 1, 2 & 3 భవనాలు తిరుమలలో భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉండే ప్రధాన వసతి గృహాలు.  ఈ భవనాలను ఆధునిక సౌకర్యాలతో – ఎయిర్ కండిషనింగ్, మెరుగైన బెడ్డింగ్, వై-ఫై, శుభ్రమైన టాయిలెట్స్, 24 గంటల భద్రత – కల్పించి పూర్తి రూపురేఖలు మార్చనున్నారు. ఈ పనులు 2026 చివరి నాటికి పూర్తవుతాయని టీటీడీ అంచనా వేస్తోంది.

 రాజ్ మంతెన కుమార్తె పెళ్లి జైపూర్ లో ఘనంగా జరిగింది. కుమార్తె, అల్లుడితో కలిసి శ్రీవారి దర్శనానికి కుటుంబంతో సహా రాజ్ మంతెన వచ్చారు. 
 
తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త రాజ్ మంతెన. ఫార్మా, ఐటీ రంగాల్లో భారీ కంపెనీలు నడిపి, వాటిని విక్రయించి బిలియనీర్ స్థాయికి చేరిన ఆయన, ఇటీవల తన కుమార్తె నేత్ర మంతె  వివాహాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరిపించారు. ఈ పెళ్లికి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, కృతి సనన్ వంటి అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సంఘటనతో ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

 
రాజ్ మంతెన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కలవపూడి సమీపంలోని చిన్న గ్రామంలో జన్మించారు. తెలుగు కుటుంబంలో పెరిగిన ఆయన, యువకులంగా అమెరికాకు  వెళ్లి, ఫార్మా ,  ఐటీ రంగాల్లో కెరీర్ ప్రారంభించారు. అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో కంపెనీలు స్థాపించి, వాటిని విజయవంతంగా నడిపారు. ముఖ్యంగా, ఫార్మా కంపెనీలు, ఐటీ సర్వీసెస్‌లో భారీ లాభాలు సంపాదించారు. గత 10-15 సంవత్సరాల్లో తన కంపెనీలను విక్రయించడం ద్వారా డాలర్లలో బిలియన్లు ఆర్జించినట్టు అంచనా.   
 
 మాజీ బీజేపీ ఎంపీ, మాజీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు గోకరాజు గంగరాజు అల్లుడు. గంగరాజు కుమార్తెను ఆయన వివాహం చేసుకున్నారు. రాజ్ మంతెన తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా దానం చేస్తారు .

 

 

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Jogi Ramesh Domestic Violence Case: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget