అన్వేషించండి

CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి

Hyderabad Bengaluru as defence and aerospace corridor | బెంగళూరు

Safran Aircraft Engine MRO Facility | శంషాబాద్: శంషాబాద్‌ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ సాఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) సెంటర్‌ ను ఆన్ లైన్ ద్వారా  ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్‌ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త MRO యూనిట్‌కు శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. బెంగళూరు- హైదరాబాద్‌ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ముఖ్యమం రేవంత్ రెడ్డి భారత ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.


CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
హైదరాబాద్‌లో ఏరోస్పేస్ వృద్ధిలో మైలురాయి
హైదరాబాద్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) కొత్త సెంటర్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణపై పూర్తి నమ్మకంతో హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు ఎంచుకున్న సఫ్రాన్‌ సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త సదుపాయం తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశంలోనే LEAP ఇంజిన్ల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సెంటర్ కావడం విశేషం. రూ.1,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం ద్వారా 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభించడంతో పాటు, మన స్థానిక ఎంఎస్‌ఎంఈలు (MSMEs), ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.


CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి

సఫ్రాన్‌కు చెందిన M88 మిలిటరీ ఇంజిన్ MRO కి కూడా శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. ఈ మిలిటరీ MRO భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌లలో ఒకటిగా నిలవనుంది. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కంటే ఎక్కువ ఎంఎస్‌ఎంఈలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎం.ఎస్.ఎమ్.ఈ. విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZల కారణంగా సఫ్రాన్, బోయింగ్, ఎయిర్‌బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ ప్రపంచ కంపెనీలు తయారీ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. ఈ కారణంగానే హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ MRO, ఏరో ఇంజిన్ హబ్‌లలో ఒకటిగా రూపుదిద్దుకుందన్నారు.


CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి

‘ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధిని వివరిస్తూ, గత ఏడాది మన ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. కేవలం 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు చేరుకున్నాయి. మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను అధిగమించడం విశేషం. తెలంగాణ ఇప్పటికే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఏరోస్పేస్ అవార్డును అందుకుంది. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం (స్కిల్లింగ్) చాలా ముఖ్యమైన ప్రమాణమని గుర్తించిన ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం చేసుకుంది. రాష్ట్రంలోని 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లను (ఐటీఐఎస్) అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతుందని’ రేవంత్ రెడ్డి తెలిపారు.

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం
రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రం ఈ విజన్‌ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ‘తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్’ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ ఆహ్వానించారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని  ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
Nagoba Jatara 2026: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు! నాగోబా జాతర 2026
నాగోబా జాతర: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు
Toxic Movie : రాకింగ్ లుక్‌లో రాకింగ్ స్టార్ - 'టాక్సిక్‌'లో పవర్ ఫుల్ రాయ లుక్ చూశారా?
రాకింగ్ లుక్‌లో రాకింగ్ స్టార్ - 'టాక్సిక్‌'లో పవర్ ఫుల్ రాయ లుక్ చూశారా?
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
Nagoba Jatara 2026: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు! నాగోబా జాతర 2026
నాగోబా జాతర: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు
Toxic Movie : రాకింగ్ లుక్‌లో రాకింగ్ స్టార్ - 'టాక్సిక్‌'లో పవర్ ఫుల్ రాయ లుక్ చూశారా?
రాకింగ్ లుక్‌లో రాకింగ్ స్టార్ - 'టాక్సిక్‌'లో పవర్ ఫుల్ రాయ లుక్ చూశారా?
Makar Sankranti 2026 : మకర సంక్రాంతి నాడు ఈ తప్పులు చేయకండి!
మకర సంక్రాంతి నాడు ఈ తప్పులు చేయకండి!
Home Loan : హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకు ఇల్లు స్వాధీనం చేసుకుంటుందా? పూర్తి వివరాలివే
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకు ఇల్లు స్వాధీనం చేసుకుంటుందా? పూర్తి వివరాలివే
Hook Step Song : వింటేజ్ మెగాస్టార్ హుక్ స్టెప్ చూశారా! - మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలే... పార్టీకి సెట్ అయ్యే లిరిక్స్
వింటేజ్ మెగాస్టార్ హుక్ స్టెప్ చూశారా! - మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలే... పార్టీకి సెట్ అయ్యే లిరిక్స్
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
బంగారం వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
Embed widget