గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వము జీవో విడుదల చేసింది.

Published by: Shankar Dukanam

రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదు (SC, ST, BC అన్ని కలిపి)

మహిళ రిజర్వేషన్, తగ్గిన స్థానాలు, రొటేషన్ అమలు, లాటరీ విధానంపై స్పష్టమైన పద్ధతిని ప్రభుత్వం తెలిపింది

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 సవరణల ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్స్ రిజర్వేషన్ల కోసం సమగ్ర మార్గదర్శకాలు జారీ

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించాలి

షెడ్యూల్డ్ ఏరియాల్లో (ST ప్రాంతాల్లో) సర్పంచ్ పదవులు మొత్తం వారికే రిజర్వ్ చేయాలి

జనాభా ఆధారంగా ST, SC, BC రిజర్వేషన్లు ఇతర ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్లు రిపీట్ కాకుండా రోటేషన్ చేయాలి

మహిళల రిజర్వేషన్ ప్రతి వర్గంలో (ST/SC/BC/UR) సగం అంటే 50 శాతం ఉండాలి

కొత్త గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు RDOలు, వార్డ్ సభ్యుల రిజర్వేషన్లను MPDOల నిర్ణయిస్తారు.

జనాభా నిష్పత్తి, SEEEPC Survey 2024, 2011 సెన్సస్ వంటి డేటాను ఉపయోగించి రిజర్వేషన్లు నిర్ణయించనున్నారు