కవిత ఆరోపణలతో హాట్ టాపిక్ అయిన మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు



కేసీఆర్ సమీప బంధువు సంతోష్ రావు, చిన్నప్పటి నుంచి కవిత,కేటీఆర్‌లతో కలిసి పెరిగారు.



పుణెలో కేటీఆర్ తో పాటు చదివారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వీరు రూమ్ మేట్



తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభానికి ముందు కేసీఆర్ పిలుపుతో పార్టీలో చేరిక



కేసీఆర్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసి, పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు.



2016లో రాజ్యసభ సభ్యుడిగా చాన్స్ ఇచ్చారు కేసీఆర్. తనకు సమయానికి మందులు ఇస్తారని ఓ సందర్భంలో చెప్పారు.



కేటీఆర్ సహా ఎవరైనా కేసీఆర్‌ను కలవాలంటే సంతోష్‌ ద్వారానే జరుగుతుందని చెబుతారు.



2012లో టీ-న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, ప్రస్తుతం నమస్తే తెలంగాణ మీడియా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్‌



సెలబ్రిటీలతో గ్రీన్ చాలెంజ్ నిర్వహించి మొక్కలు నాటించడానికి ఆసక్తి చూపిస్తారు.



కవిత తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడంతో మరోసారి వెలుగులోకి సంతోష్ రావు పేరు



తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకూ స్పందించని సంతోష్ రావు