బీసీలకు 42 శాతం రిజర్వేషన్- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం

బీసీలకు 42 రిజర్వేషన్ బిల్లును ఆగస్టు 31న అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరిపి ఆమోదించాలని నిర్ణయం

తెలంగాణ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్‌ పేర్లను కేబినెట్ ప్రతిపాదించింది.

కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించాలని మంత్రివర్గం నిర్ణయం

తెలంగాణలో గోశాలల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది

నేషనల్ హైడ్రాలజీ అంశంపై తెలంగాణ కేబినెట్ చర్చించింది. భారీ వర్షాలు, వరదలతో కలిగిన పంట నష్టం, రహదారులు, ఆస్తి నష్టంపై నివేదిక తెప్పించి పరిహారం అందించనున్నారు