By: ABP Desam | Updated at : 09 Dec 2021 08:43 PM (IST)
ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఎంత ఫిట్‌మెంట్ ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంత ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత పెరుగుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయవర్గాలు ఏబీపీదేశంకు అందించిన సమాచారం ప్రకారం ఉద్యోగులకు 34 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
మామూలుగా అయితే పీఆర్సీ నివేదికను బయటపెడతారు. అందులో ఉన్న సిఫార్సుల గురించి ఉద్యోగులతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ప్రభుత్వం తన వెసులుబాటుకు అనుగుణంగా ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలి.. ఎప్పటి నుంచి వర్తింప చేయాలనేది నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి వినూత్నంగా ఆలోచించింది. పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండానే ఫిట్‌మెంట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై అధికారిక నిర్ణయం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.
34 శాతం ఫిట్‌మెంట్‌ను తక్షణం అమల్లోకి వచ్చేలా చేస్తారు. అంటే వచ్చే నెల నుంచి ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్ అందేలా చూస్తారు. నోషనల్ బెనిఫిట్‌ను మాత్రం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ దగ్గర నుంచి అంటే 2018 నుంచి వర్తింప చేస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పీఎఫ్ బెనిఫిట్ కల్పిస్తారు. ఆర్థిక శాఖ అధికారులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత మేర ప్రభుత్వం భారం పడుతుదో నివేదిక సమర్పించిన తర్వాత సీఎం ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది.
Also Read: సోమవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే చాన్స్... ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
ఉద్యోగులు ప్రధానంగా పీఆర్సీ అంశంపైనే పట్టుబడుతున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పీఆర్సీని 34 శాతం ప్రకటిస్తే వారు సంతృప్తి చెందుతారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతమే ఫిట్‌మెంట్ ఇచ్చింది. జగన్ సర్కార్ 34 శాతం ఇస్తే తెలంగాణ కన్నా ఎక్కువ ఇచ్చినట్లే. ఉద్యోగులు ఖచ్చితంగా సంతృప్తి పడే అవకాశం ఉంది.
Also Read : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Breaking News Live Telugu Updates: రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
తగ్గేదే లేదంటున్న కోటంరెడ్డి-ఉద్యమ కార్యాచరణ ప్రకటన
Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్!
AP Constable Answer Key: కానిస్టేబుల్ అభ్యర్థులకు 'కీ' కష్టాలు, ప్రాథమిక కీలో ఒకలా, ఫైనల్ కీలో మరోలా సమాధానాలు!
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య మృతి కేసులో ట్విస్ట్- జ్యోతిని వేధించి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?
Pushpa 2 Update: విశాఖలో ‘పుష్ప-2’ షూటింగ్ కంప్లీట్ - వీరాభిమానికి సర్ప్రైజ్ ఇచ్చిన బన్నీ