అన్వేషించండి

Kesineni Nani : కేశినేని నాని దారెటు ? - పోటీ విరమించుకుంటారా? వేరే పార్టీలో చేరుతారా ?

కేశినేని నాని ఏ పార్టీలో చేరుతారన్నదానిపై బెజవాడలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వైసీపీలో సీటు ఖాళీ ఉందని ఆ పార్టీ నేతలు సంకేతాలు పంపుతున్నారు.


Kesineni Nani :  బెజవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని పార్టీ మార్పు పై భారీగా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ స్దానానికి పోటీ పడుతున్న కేశినేని వచ్చే ఎన్నికల్లో అసలు బరిలో  ఉండరన్న ప్రచారం కూడా జరుగుతోంది.  కేశినేని కొంత కాలంగా పార్టీకి  , పార్టీ అగ్రనాయకత్వానికి   దూరంగా ఉంటున్నారు.    పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర బెజవాడకు వచ్చినప్పడు ఆయన ఆ కార్యక్రమానికి హజరు  కాలేదు. దీంతో ఇక ఆయన పార్టీ నుండి దూరం అవటం ఒక్కటే మిగిలి ఉందనే ప్రచారం ఊపందుకుంది.   అయితే దీని పై అటు కేశినేని నాని కాని, ఆ పార్టీలోని కీలక నేతలు కాని అసలు నోరు విప్పటం లేదు 

పాదయాత్రకు హాజరు కాకపోవడంపై స్పందించని కేశినేని నాని  

లోకేష్ తో పాదయాత్రలో పాల్లొనకపోవటం వెనుక కారణలు చెప్పేందుకు   కేశినేని నాని అస్సలు ఇంట్రస్ట్ చూపించలేదు. ఆయన మౌనం పై కూడ సొంత పార్టీ కి చెందిన నాయకుల్లో నే రక రకాలుగా రూమర్స్ క్రియేట్ అయిపోతున్నాయి. అయినా వాటిని  కేశినేని పట్టించుకోవటం లేదు.  కేశినేని నాని తీరు , ఆయన వ్యవహర శైలి పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  చర్చకు దారి తీసింది. ఇటీవల కాలంలో నందిగామకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు మెండి తోక జగన్ మోహన్ రావుతో, కలసి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని ఆయన్ను అభినందించారు. అంతే కాదు మైలవరం శాసన సభ్యుడిగా ఉన్నవసంత తో కూడ కేశినేని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

వైసీపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం

ఆయన తీరుతో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని   ఊహాగానాలు వినిపించాయి. అయితే  ఇటీవల కేశినేని నాని ఇంటిలో ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమం లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో అంతా సైలెంట్ అయ్యిపోయారు. అయితే ఇప్పుడు లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్రకు సైతం పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న కేశినేని నాని హజరు కాలేదు. అంతే కాదు ఇటీవల చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవాడలో జరిగిన సమయంలో కూడ కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులతో కలసి పాల్గొనటం, అధికారులను వెంట పెట్టుకొని నాని ముందుకు వెళ్ళటం వెనుక కారణాలు పై  చర్చ జరుగుతోంది.

వస్తే  వైసీపీ టిక్కెట్ ఇస్తారనే సంకేతాలు

వైసీపీలో ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరూ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ తర్వాత పెద్దగా యాక్టివ్ రాజకీయాల్లో లేరు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఈ సారి పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.  విజయవాడ పార్లమెంట్ స్దానం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఖాళీగా ఉంది కాబట్టి, ఆయన వచ్చినా ఆశ్చర్యం లేదని వైసీపీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదంతామైండ్ గేమ్ అని.. ఆయన పోటీ చేయకుండా అయినా ఉంటారు కానీ వైసీపీ తరపున పోటీ చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా కేశినేని నాని మాత్రం హాట్ టాపిక్ అవుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget