Deer Road Accident: అసలు నేనెలా పుట్టాను.. ఏదో శబ్దం వచ్చింది.. చూసేసరికి ఇక్కడ పడి ఉన్నాను
ఆ జింక పిల్లకు తన పుట్టుక గురించి తెలియదు. ఇక తల్లిపాల రుచి భవిష్యత్ లోనూ అస్సలు తెలియదు. ఎందుకంటే ఓ యాక్సిడెంట్ లో పుట్టింది తను.
ఇంతకీ నేనెలా పుట్టాను.. అసలు ఎక్కడ ఉన్నాను.. అందరు ఏంటీ వింతగా చూస్తున్నారు. మా అమ్మ కడుపులో ఉన్నట్టు ఉన్నాను.. తను నడుస్తుంటే.. ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఆపై చూస్తే.. నేను బయటపడి ఉన్నాను.. ఈ మాటలేంటి అనుకుంటున్నారా? తిరుమల ఘాట్ రోడ్డులో ఓ జింక పిల్ల పుట్టింది. ఒకవేళ దానికి మాటలు వస్తే పాపం.. ఇలాంటి మాటాలే చెప్పేదేమో. ఎందుకంటే అక్కడ జరిగిన ప్రమాదం అలాంటింది మరి. ఇంతకీ ఏం జరిగిందంటే..?
తిరుమల ఘాట్ రోడ్డు అంటే.. ఎప్పటికీ వాహనాలు తిరిగే ఏరియా. అయితే ఇది వరకు.. రోడ్డు దాటినట్టుగానే.. ఓ జింక మెుదటి ఘాట్ రోడ్డు వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. అప్పుడప్పుడూ వెళ్లే దారేగా అనుకుంది. కానీ.. అదే దానికి చివరి రోజు అనుకోలేదు. మెుదటి ఘాట్ రోడ్డులోని.. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా.. జింకను వేగంగా వస్తున్న టీటీడీ పరకామణి బస్సు ఢీ కొట్టింది.
బస్సు ఒక్కసారిగా తాకడంతో.. జింక ఎగిరి.. పది అడుగుల దూరంలో పడింది. వేగంగా వచ్చిన వాహనం తగలడంతో పాపం గాలిలోనే దాని ప్రాణాలు పోయినట్టు ఉన్నాయి. అప్పటికే ఆ జింక కడుపులో మరో ప్రాణి ఉంది. చనిపోతూ..చనిపోతూ.. జింక పిల్లకు జన్మనిచ్చింది. ఈ ఘటన చూసిన ప్రయాణికులు.. వెంటనే.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చేవరకు జింక పిల్లకు సేవలందించారు. ప్రస్తుతం జింక పిల్ల తిరుపతి ఎస్వీ జూకి పంపారు. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
జింకకు యాక్సిడెంట్ అయి.. పిల్లకు జన్మనిస్తూ.. మృతి చెందడాన్ని చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. ఈ దృశ్యాన్ని ఫొన్ లో చూశారు ఎంపీ గురుమూర్తి. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read: JC Prabhakar : తాడిపత్రిలో మళ్లీ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. ఈ సారి జెండా పండగ పంచాయతీ !