By: ABP Desam | Updated at : 24 Jan 2022 07:35 PM (IST)
తాడిపత్రిలో జెండా పండుగపై వివాదం
తాడిపత్రి రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. ఎమ్మెల్యేగా వైఎస్ఆర్‌సీపీకి చెందిన పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండటంతో ఆధిపత్య పోరాటం సహజంగానే ఉంటుంది. వీరి మధ్య పాత ఫ్యాక్షన్ గొడవలు కూడా ఉండటంతో అది అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితులూ ఏర్పడుతూంటాయి. తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా వారు ఇరువురి మధ్య జెండా పండుగ విషయంలో కొత్త పంచాయతీ ప్రారంభమయింది.
Also Read: సారైనా ఆదుకుంటారా ? కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న ఏపీ ప్రభుత్వం !
మున్సిపల్ చైర్మన్ హోదాలో తాడిపత్రిలోని జాయ్ పార్క్‌లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయించారు. అయితే ఆ రోజు జాతీయ పతాకం ఎగురవేయవద్దని అధికారులను ఎమ్మెల్యే పెద్దారెడ్డి బెదిరిస్తున్నారని జేసీ ఆరోపిస్తున్నారు. తాము నిర్మించిన జాయ్ పార్కుకు రిజిస్ట్రేషన్ ఉంది. మీరు నిర్మిస్తున్న పార్కు రిజిస్ట్రేషన్ ఉందా అని ప్రశ్నించారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి వెళ్లవద్దని అధికారులను బెదిరింపులకు గురిచేయడం సరికాదని,, ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే సహకరిస్తామని సూచించారు.
ఎమ్మెల్యేగా మిమ్మల్ని గౌరవించినట్లు మీ కుటుంబ సభ్యులందర అధికారులు గౌరవించాలనుకోవడం మీ అనైతిక చర్యకు నిదర్శనమని పెద్దారెడ్డిపై జేసీ విరుచుకుపడ్డారు. అధికారులను బెదిరింపులకు గురి చేస్తే వారు ఎదురు తిరిగితే ప్రజాప్రతినిధులు ఎవరూ తట్టుకోలేరన్నారు. తాడిపత్రి జాయ్ పార్క్ లో రిపబ్లిక్ డే రోజు ఎన్ని ఆటంకాలు ఎదురైనా జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి జాయ్ పార్క్‌లో జెండా పండుగ నిర్వహించాలంటున్నారు.. ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం వారు కొత్తగా నిర్మిస్తున్న పార్కులో నిర్వహించాలంటున్నారు. అది అనుమతులు లేని పార్క్ అని మున్సిపల్ చైర్మన్ అంటున్నారు.
Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?
మున్సిపల్ అధికారులు అట ఎమ్మెల్యే, ఇటు మున్సిపల్ చైర్మన్ వర్గాల మధ్య నలిగిపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు వెళ్లినా .. వెళ్లకపోయినా చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎవరికి వారు ఆధిపత్య పోరాటంలో చురుగ్గా వ్యవహరిస్తూండటంతో... అధికారులు ఎవరి మాట వినాలో తెలియక తికమక పడుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?
KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Weather Latest Update: నేడు బంగాళాఖాతంలో తుపాను, అతి భారీ వర్ష సూచన: ఐఎండీ
GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>