Paritala Ravi : పరిటాల రవి చివరి కోరిక తీరలేదు.. ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే ఉంది ! స్క్రిప్టేమిటనుకుంటున్నారా.. అదే ట్విస్ట్...

పరిటాల రవి చివరి కోరిక చెంఘిజ్ ఖాన్ సినిమా నిర్మాణం. ఆ పనుల్లో ఉండగానే హత్యకు గురయ్యారు. ఆయన వర్థంతి సందర్భంగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు..

FOLLOW US: 

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి 17వ వర్థంతి కరోనా నిబంధనలను పాటిస్తూ నిరాడంబరంగా చేసుకున్నారు. పరిటాల రవికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమా స్టార్ కాకుండా ఆ తరహా మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతల్లో పరిటాల రవి ఒకరు.  ఆయన హత్యకు గురయ్యే నాటికి ఓ పనిని చేయాలని బలంగా సంకల్పించారు. అదే ఆయన చివరి కోరికగా మిగిలిపోయింది. పని కూడా ప్రారంభించారు. కానీ మధ్యలో ఆగిపోయింది.

Also Read: సారైనా ఆదుకుంటారా ? కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న ఏపీ ప్రభుత్వం !

స్నేహలతా ఫిలింస్‌ పేరిట పరిటాల రవి  ఓ చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.  ఆ బ్యానర్‌పైన శంకర్‌ దర్శకత్వంలో.. 'శ్రీరాములయ్య' అనే పేరుతో తన తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కించారు. ఆ రోజుల్లో అది సూపర్‌ హిట్‌ అయింది. అదే ఊపులో  పరిటాల రవి తమ సొంత బ్యానర్‌లో మరో సినిమాను తీయాలని నిర్ణయించారు. దీనికోసం కథను కూడా సిద్ధం చేసుకున్నారు. స్వతహాగా  పుస్తకాలు చదివే అలవాటున్న రవికి  తెన్నేటి సూరి రచించిన చెంఘిజ్‌ఖాన్‌ నవల విపరీతంగా నచ్చింది. దాన్ని సినిమాగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఆ నవల కాపీరైట్స్‌ని తెన్నేటి సూరి తనయుడు తెన్నేటి విశ్వం నుంచి కొనుగోలు చేశారు. 

Also Read: కుప్పంలో అక్రమ మైనింగ్... చంద్రబాబు ఆరోపణలు నిజమేనా..?... క్వారీలపై అధికారుల వరుస దాడులు

చెంఘిజ్ ఖాన్ నవలను సినిమాకు తగ్గట్లుగా మార్పు చేర్పులు చేస్తూ ఎవర్ని హీరోగా పెట్టాలన్నదానిపై చర్చలు కూడా జరిపారు. చెంఘిజ్ ఖాన్ పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదా శ్రీహరిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ ఈలోపే పరిటాల రవి శత్రువులు, ఆయన్ను అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హత్య చేశారు. అలా.. ఆయన శ్వాసతో పాటే, చెంఘిజ్‌ఖాన్‌ సినిమా ప్రయత్నమూ ఆగిపోయింది. తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు. ఈ నవలపై కాపీ రైట్స్ పరిటాల రవి కుటుంబ సభ్యుల దగ్గరే ఉన్నాయి. చెంఘిజ్‌ఖాన్‌ని తెరకెక్కించే ప్రయత్నం మాత్రం ముందుకు సాగలేదు.

Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?

పరిటాల రవి క్రమశిక్షణకు చాలా విలువ ఇచ్చేవారు. 2004లో కరువు కారణంగా  పేదల ఇంట పెళ్లిళ్లు జరగడం లేదని తెలుసుకుని 108 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. దానికి ముందస్తుగా జరగుతున్న ఏర్పాట్ల కవరేజీ కోసం వెళ్లిన పాత్రికేయులకు వింతైన సన్నివేశం కనిపించింది. సూటుబూటు వేసుకుని, టైలు కట్టుకుని ఎగ్జిక్యూటివ్స్‌లా ఉన్న కొందరు యువకులు, పెళ్లి జరిగే ముత్యలమ్మ గుడి దగ్గర అతిథుల చెప్పులు శుభ్రం చేస్తూ కనిపించారు. ఎందుకిలా అని ఆరా తీస్తే..  అంతకు ముందు అప్పగించిన పనిని సరిగా  చేయకపోవడంతో పరిటాల రవికి గుడికి వచ్చీ వెళ్లే వారి చెప్పులు శుభ్రం చేయమని చెప్పారట. ఆయన ఆ మాట అనడమే తరువాయిగా యువకులు, నామోషీ అనుకోకుండా, పనిలోకి దిగిపోయారు.  వారంతా అప్పటికే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. పరిటాల రవి అభిమానులు. ఈ సన్నివేశం చూశాక, పరిటాల రవి క్రమశిక్షణకు ఇచ్చే విలువ, తన అభిమానులకు దాన్ని ప్రేమగా అలవాటు చేసే విధానం .. పాత్రికేయులకు తెలిసొచ్చింది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Jan 2022 05:01 PM (IST) Tags: Anantapur District Paritala Ravi Paritala Ravindra Genghis Khan Paritala fans Paritala discipline

సంబంధిత కథనాలు

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

టాప్ స్టోరీస్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్