Budda Venkanna : కొడాలి నాని, డీజీపీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో బుద్దా వెంకన్న అరెస్ట్ - విజయవాడలో ఉద్రిక్తత !
కొడాలి నాని, డీజీపీ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్నను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి కొడాలి నానితో పాటు డీజీపీ గౌతంసవాంగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళలారు. ఇంటి వద్ద రెండు, మూడుగంటల పాటు హైడ్రామా నడిచింది. కొడాలి నాని, డీజీపీలపై విచారణ జరిపేందుకు పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు కోరారు.
Also Read: నచ్చ చెప్పేందుకు మంగళవారం కూడా ప్రయత్నం.. ఉద్యోగులు రావాలన్న ప్రభుత్వ కమిటీ !
అయితే 41 ఏ కింద నోటీసులు ఇవ్వకుండా తాను పోలీస్ స్టేషన్‌కు ఎలా వస్తానని ఆయన ప్రశ్నించారు. స్టేషన్‌కు వస్తే ... అక్కడే ఇస్తామని పోలీసులు చెప్పారు. అయితే బుద్దా వెంకన్న మాత్రం దానికి అంగీకరించలేదు. ఇలా రెండు గంటల పాటు ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్న తర్వాత పోలీసులు ాయనను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బుద్దా వెంకన్న సోమవారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టి కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: సారైనా ఆదుకుంటారా ? కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న ఏపీ ప్రభుత్వం !
చంద్రబాబును, టీడీపీ నేతల్ని కొడాలి నాని అత్యంత అసభ్యకరంగా దూషిస్తున్న విషయాన్ని గుర్తు చేసి.. ఇక నుంచి తాము కూడా అంతకు మించి మాట్లాడతామని తిట్లు అందుకున్నారు. గుడివాడలో కేసినో జరిగిన విషయంపై డీజీపీ స్పందించకపోవడంపై కూడా బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే డీజీపీపై చేసిన వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు ఎవరైనా ఫిర్యాదు చేశారా లేదా అన్నదానిపై స్పష్టతలేదు.
Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?
అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని అత్యంత దారుణంగా తమను.. తమ అధినేతను.. కుటుంబసభ్యులను కూడా దూషిస్తున్ా..ఎందుకు కేసు పెట్టరని పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో భారీగా పోలీసుల్ని మోహరించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి