(Source: ECI/ABP News/ABP Majha)
Pradhan Mantri Rashtriya Bal Puraskar: రాష్ట్రానికి చెందిన ఇద్దరు బాలికలకు.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు
శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు, విశాకు చెందిన అమేయకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డును అందుకున్నారు.
భారత ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుకు ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి గురుగు హిమప్రియ ఎంపికయ్యింది. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో హిమప్రియను ఈ అవార్డ్ వరించింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం వర్చువల్ విధానంలో హిమప్రియకు ధ్రువపత్రంతో పాటు లక్ష రూపాయల నగదును అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఈ అవార్డును అందించారు.
హరిప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీలో విధులు నిర్వర్తించేవారు. ఉద్యోగరీత్యా 2018 సంవత్సరంలో జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్వార్టర్ లో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి 10 న వీరు నివాసముంటున్న క్వార్టర్ పై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో గాయాల పాలైన హిమప్రియ మనోధైర్యంతో పోరాటం చేసింది. తన తల్లితో పాటు క్వార్టర్స్ లో ఉన్న కొంతమందిని కాపాడింది. ఉగ్రవాదుల దాడిలో గాయాలైనప్పటికి హిమప్రియ చేసిన సాహసానికి ఈ అవార్డ్ వరించింది. సాహస బాలిక అవార్డుకు ఎంపికైన హిమప్రియను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా యంత్రాంగం అభినందించింది. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి హిమప్రియతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాకు చెందిన మరో బాలికకు
విశాఖపట్నానికి చెందిన కుమారి లగుడు అమేయ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2021 అవార్డును అందుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడి అమేయను ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ 2021 సంవత్సరానికి దేశం మొత్తం నుండి 32 మందిలో ఈ అవార్డుకు ఎంపిక అయిన వారిలో అమేయ.. శాస్త్రీయ నృత్య కళాకారిణి గా ఈ అవార్డుకు ఎంపికయ్యారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
13 ఏళ్ళ అమేయ శ్రీ సత్యసాయి విద్యా విహార్కి లో 9 వ తరగతి చదువుతోంది. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా అమేయతో ప్రధాని మాట్లాడారు. ప్రధాని అడిగిన దానికి బదులిస్తూ భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని, ప్రపంచ నలుమూలల మన కళలు సంస్కృతి చాటి చెప్పాలని భవిష్యత్తు తరాలకు ఈ విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపింది.
Also Read: Nellore Crime: టీ కొట్టులో తుపాను.. నెల్లూరు హత్య కేసులో బిత్తరపోయే ట్విస్టులు..