Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 332 మందికి కరోనా పాజిటివ్.. భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే కొనసాగుతోంది. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదు. తాజాగా 332 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు.
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 30 వేల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 332 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,57,145కు చేరుకుంది. తాజాగా కోవిడ్19తో పోరాడుతూ 7 మంది మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,302కు చేరుకుంది.
#COVIDUpdates: 16/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 16, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,57,145 పాజిటివ్ కేసు లకు గాను
*20,36,650 మంది డిశ్చార్జ్ కాగా
*14,302 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,193#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/neVrj5ao3g
ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 20 లక్షల 57 వేల 145 మంది కరోనా బారిన పడగా, అందులో 20,36,650 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు దాదాపు రెట్టింపు ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. 585 మంది కొవిడ్19 నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,193 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,89,54,134 (2 కోట్ల 89 లక్షల 54 వేల 134) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు జరగగా... నిన్న ఒక్కరోజులో 29,243 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగానే సాగుతోంది.
Also Read: విద్యుత్ కోతలు లేవు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ! ఏపీ ప్రభుత్వం క్లారిటీ !
చిత్తూరులో కరోనా అధిక ప్రభావం..
చిత్తూరులో 55 మంది కరోనా బారిన పడగా.. కడప జిల్లాలో 43, గుంటూరులో 42, పశ్చిమ గోదావరిలో 36, కృష్ణాలో 32 మందికి కరోనా సోకినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. కర్నూలు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 3 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్19 బారిన పడి కృష్ణా జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో చనిపోయారు.
Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!