By: ABP Desam | Updated at : 16 Oct 2021 04:07 PM (IST)
విద్యుత్ కోతలు లేవన్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలకు అవసరమైన విద్యుత్‌ను అందిస్తున్నామని ఎక్కడా విద్యుత్ కోతలను అమలు చేయడం లేదని ఏపీ ఇంధన శాఖ అధికారికంగా ప్రకటించింది. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట 16వ తేదీ నుంచి అంటే శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు అమలవుబోతున్నట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎక్కడా కరెంట్ కోతలు లేవని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల అనధికారికంగా విద్యుత కోతలు అమలవుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా పదే పదే ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ఏపీలో విద్యుత్ ఉత్పత్తికి, వినియోగానికి మధ్య చాలా తేడా ఉంది. పెద్ద ఎత్తున కరెంట్‌ను పవర్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ పెరగడంతో యూనిట్ ధర రూ. ఇరవై వరకూ వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ను సరఫరా చేయడం ఏపీ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.
Also Read : జగన్ ప్రభుత్వంపై డీఎల్ విమర్శలు ! గుర్తించలేదనే అసంతృప్తే కారణమా ?
ఓ వైపు బొగ్గు కొరత , మరో వైపు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రజలను హెచ్చరించింది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో కరెంట్ కోతలు విధించాల్సి రావొచ్చని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కానీ కోతలు విధిస్తామని చెప్పలేదు. అధికారికంగా ఏపీ ఇంధన శాఖ ఎలాంటి ప్రకటనలు చేయకుండానే సోషల్ మీడియాలో మాత్రం పండుగ అయిపోయిన తర్వాతి రోజు నుంచి కరెంట్ కోతలు అనే ప్రచారం ప్రారంభమయింది.
Also Read : ఏపీలో బొగ్గు కొరతపై జగన్ రివ్యూ.. కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశాలు
మూడు రోజుల కిందట విద్యుత్ రంగ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా కొనుగోలు చేయాలని .. కరెంట్ కోతలు మాత్రం ఉండకూడదని ఆదేశించారు. ఆ ప్రకారం విద్యుత్ డిమాండ్‌ను అందుకునేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారికంగా కరెంట్ కోతలు విధించడం లేదని.. విధించే అవకాశం లేదని ప్రజలకు ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి.
Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?
Krishna District: భార్యను కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు
Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్
పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు
హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి