Coronavirus Cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పాజిటివ్ కంటే డిశ్ఛార్జ్ కేసులే అధికం
కరోనా వైరస్ కట్టడిలో ఏపీ ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్ఛార్జ్ కేసులు రెట్టింపు ఉన్నాయి. ఏపీ వైద్యశాఖ లేటెస్ట్ బులెటిన్ వివరాలిలా ఉన్నాయి.
#APFightsCorona: ఏపీలో కరోనా వ్యాప్తి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 295 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 7 మందిని కొవిడ్19 మహమ్మారి బలిగొది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,60,977 పాజిటివ్ కేసులకు గాను.. 20,41,797 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 14,350 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,830 అని ఏపీ వైద్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.
#COVIDUpdates: 25/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 25, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,60,977 పాజిటివ్ కేసు లకు గాను
*20,41,797 మంది డిశ్చార్జ్ కాగా
*14,350 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,830#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JTmLEuJAkI
కరోనా టెస్టుల వివరాలు..
తాజా కేసులతో కలిపితే మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,60,977కు చేరుకుంది. ఏపీలో మొత్తం 2,92,91,896 (2 కోట్ల 92 లక్షల 91 వేల 896) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 27,641 శాంపిల్స్ పరీక్షలు చేశారు.
Also Read: డేటింగ్ యాప్ పై కోర్టుకెళ్లిన యువకుడు... కారణం తెలిస్తే నవ్వుకుంటారు
#COVIDUpdates: As on 25th October, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 25, 2021
COVID Positives: 20,60,977
Discharged: 20,41,797
Deceased: 14,350
Active Cases: 4,830#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rkQXxxeAsM
ఈ జిల్లాల్లో కరోనా తీవ్ర ప్రభావం..
కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు కొవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో నిన్న తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 69 మందికి కరోనా సోకగా.. కృష్ణాలో 68, చిత్తూరులో 40, గుంటూరులో 31, విశాఖపట్నంలో 22 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో ఒకరికి కరోనా సోకినట్లు తాజా బులెటిన్‌లో తెలిపారు.
Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
ఏపీలో కరోనా వ్యాక్సిన్లు 5 కోట్లకు పైగా పంపిణీ అయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జిల్లాలవారీగా కొవిడ్ టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి.
#AndhraPradesh has administered more than #5Crore #COVIDVaccine doses. Following are the number of doses administered in the districts of AP
— ArogyaAndhra (@ArogyaAndhra) October 25, 2021
If you are yet to get the jab, visit your nearest #vaccination centre#APFightsCorona #largestVaccinationdrive pic.twitter.com/HYQ49twN4p