TTD: టీటీడీ ఉదయాస్తమాన టికెట్లపై వివాదం.. పిల్లల ఆసుపత్రి నిర్వహణ బాధ్యత ప్రభుత్వం చూసుకోవాలి
టీటీడీ నిర్ణయాలపై ఒక్కోసారి వివాదలు అవుతుంటాయి. టీటీడీ నిర్ణయాలను కొందరూ స్వాగతిస్తుంటే.. మరి కొందరేమో వివాదాలకు దారి తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి ఉదయాస్తమాన టికెట్లపై వివాదం నడుస్తోంది.
శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవ టికెట్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా వచ్చిన నిధులను చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించేలా ఇటీవల్ల టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే అందుబాటులో ఉన్న ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను పారదర్శకంగా భక్తులకు కేటాయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు తగ్గట్టుగా సాధారణ రోజుల్లో కోటి రూపాయలు ధర, శుక్రవారం నాడు కోటిన్నరగా టిక్కెటు ధర నిర్ణయించే సూచనలు కనిపిస్తుంది.
స్వామి కళ్లారా చూసి.. తరించే భాగ్యం ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా భక్తులకు లభిస్తుంది. ఇక వేకువ జామున సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీ వేంకటేశ్వరుడుని కనులారా తరించే అవకాశం ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కలిగిన భక్తులకు లభిస్తుంది. దీంతో ఉదయాస్తమాన సేవ టిక్కెట్లకు ఉన్న డిమాండ్ ఎక్కువే. టీటీడీ ప్రవేశ పెట్టిన కొద్ది కాలంలోనే భారీగా ఉదయాస్తమాన సేవ టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేయడంతో.. తరువాత వీటి కేటాయింపును తాత్కాలికంగా నిలిపి వేసింది టీటీడీ.
సామాన్య భక్తులకు దర్శనంలో అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను నిలిపివేశారు. అయితే గతంలో భక్తులకు జారీ చేసిన టికెట్లు కాలపరిమితి ముగిసి పోవడంతో ఖాళీగా ఉన్న టిక్కెట్లను తిరిగి భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ప్రస్తుతం ఉదయాస్తమాన సేవా టిక్కేట్లను ఓ మంచి ఉద్దేశంతో భక్తులకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేశారు. వీటి కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి వినియోగించాలని భావిస్తోంది.
ప్రస్తుతం టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో పారదర్శకంగా భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తుంది టీటీడీ. శ్రీవారి దర్శన టిక్కెట్లు కేటాయించిన తరహాలోనే ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తుంది. వీలైనంత త్వరగా టిక్కెట్లు ఆన్లైన్ లో ఉంచేందుకు అధికారులు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరే అవకాశాలు ఉంది.
టీటీడీ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది భక్తులు, రాజకీయ నాయకులు స్వాగతిస్తుంటే కొందరు మాత్రం టీటీడీ తప్పుడు నిర్ణయం తీసుకుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కిష్కింద క్షేత్ర పీఠాధిపతి గొవిందానంద సరస్వతీ స్వామి.. కామెంట్స్ చేశారు. స్వామి వారి సేవలను భక్తులకు ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీవారిని సేవలను ఏ విధంగా కోటి రూపాయలకు విక్రయిస్తారని ప్రశ్నించారు. సేవలను టిక్కెట్ల రూపంలో విక్రయించి దాని ద్వారా వచ్చే నగదును చిన్న పిల్లల ఆసుపత్రికి ఉపయోగించరాదని, ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ప్రభుత్వం భరించాలని గోవిందానంద సరస్వతి కోరారు.
టీటీడీ పాలక మండలి పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకుందని.. వెంటనే వెనక్కి తీసుకోవాలని గోవిందానంద స్వామి డిమాండ్ చేశారు. పాలక మండలి భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా నిర్ణయం తీసుకుంటుంటే శ్రీవారి ఆలయ పెద్ద జియర్లు, చిన్న జియర్లు ఏం చేస్తున్నారనిప్రశ్నించారు.
Also Read: jagan CBI Court : అందుకే సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు..మెమో సమర్పించిన సీఎం జగన్ !