అన్వేషించండి

Andhra Politis: వైసీపీ దైవ అపచారం పై కూటమి సమరశంఖం - రాష్ట్రవ్యాప్త పూజలు, సంప్రోక్షణలకు పిలుపు

Statewide prayers: శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు, దేవుడిపై పదే పదే అపచారానికి పాల్పడుతున్న తీరును కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Andhra divine Politis: శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు అత్యవసరంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పవిత్రమైన సభలోకి రాజకీయ ప్రయోజనాల కోసం వేంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకురావడం దైవ అపచారమని కూటమి నేతలు మండిపడ్డారు. వైసీపీ నేతలు పదే పదే హిందూ దేవుళ్లను, భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని, ఈ అంశాన్ని సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాజకీయ పోరాటాల కోసం దైవ రూపాన్ని వాడుకోవడం వారి నైతిక పతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.   

శనివారం వేంకటేశ్వరుని ఆలయాల్లో పూజలు                       
 
వైసీపీ నేతలు చేసిన ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా  శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవాలయాల వద్ద సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.   ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి తోడు, తాజా ఘటనను కూడా జోడించి వైసీపీ హిందూ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్యాచరణ ఖరారు చేశారు. ప్రతి గ్రామంలోనూ వైసీపీ చేస్తున్న అపచారాల గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.                                         

ఆధ్యాత్మిక తప్పిదాలపై వైసీపీని ఇరకాటంలోకి నెట్టే ప్లాన్                           

కేవలం రాజకీయ నిరసనలకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక కోణంలో కూడా వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు కూటమి సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రముఖ మఠాధిపతులు, స్వామీజీలు ,  హిందూ ధర్మ ప్రచారకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేవుడి విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరుపై ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయాలను సేకరించి, వారి ద్వారా భక్తులకు అవగాహన కల్పించనున్నారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగి అపచారం చేయడం వల్ల కలిగే అనర్థాలను చర్చా వేదికల ద్వారా ప్రజలకు వివరించనున్నారు.                                        

హిందూ దేవుళ్లను కించ పరుస్తున్నారని ఆరోపణ                 
 
గత ప్రభుత్వ హయాం నుండి నేటి వరకు వైసీపీ నేతలు పదే పదే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని, దీనికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కూటమి నేతలు హెచ్చరించారు. కల్తీ నెయ్యి ఉదంతం మొదలుకొని మండలిలో ఫోటోల ప్రదర్శన వరకు అన్నీ ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వైసీపీకి రాజకీయంగా కాలం దగ్గర పడిందని, ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.         

టాప్ హెడ్ లైన్స్

Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Dussehra 2026: విజయదశమి శమీ పూజ, రాజరాజేశ్వరి దేవి అలంకారం పూజా విధానం, నైవేద్యం వివరాలు!
విజయదశమి శమీ పూజ, రాజరాజేశ్వరి దేవి అలంకారం పూజా విధానం, నైవేద్యం వివరాలు!
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget